పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. మొన్నటి వరకు జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది.
గురువారం(సెప్టెంబర్ 19,2019) 10 గ్రాముల (24 క్యారెట్లు) పసిడి ధర రూ. 2వేల 3వందలు తగ్గి రూ.38వేల 665కి చేరుకుంది. నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం వంటి కారణాలతో పసిడి ధర తగ్గినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర కూడా కిలో 51,489 గరిష్ట స్థాయి నుంచి రూ.5వేలకు పడిపోయింది.
ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలో రూ.39వేల 885 ధర ఉన్న బంగారం కొన్ని రోజుల తర్వాత మళ్లీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ పై అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు 0.66 శాతానికి పడిపోయి రూ.37వేల 600 దగ్గర ట్రేడ్ అయింది.
గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఈ రోజు 1,492.15 ఔన్సుల వరకు స్వల్పంగా పడిపోయాయి. యూఎస్, చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్ భయాందోళనలతో ఈ నెల ఆరంభంలో బంగారం ధరలు ఆరేళ్ల గరిష్ట స్థాయి నుంచి 1,550 డాలర్ల వరకు పెరిగాయి.