Top 10 Selling Cars in October : అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. దుమ్ములేపిన మారుతి మోడల్స్..!

Top 10 Selling cars in October : గత అక్టోబర్‌లో ఆటోమొబైల్ కంపెనీలు రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగించాయి. అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో నిలిచింది.

Top 10 Selling cars in October : అక్టోబర్ 2023.. ఆటోమొబైల్ కంపెనీలకు బాగా కలిసొచ్చింది. అందుకే.. రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు కొనసాగాయి. అందులోనూ ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్‌లో అత్యధికంగా ఎస్‌యూవీల అమ్మకాలు జరిగాయి. ఆటోమోటివ్ విక్రయాల్లో అనేక ఎస్‌యూవీలు టాప్ 10 జాబితాలోకి ప్రవేశించాయి. మార్కెట్లోకి ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ వదిలిన కార్ల తయారీదారులు అదే జోరును ఎస్‌యూవీ విక్రయాలను కొనసాగించారు. అయితే, హ్యాచ్‌బ్యాక్ సేల్స కూడా భారీగా పెరిగాయి. ఎప్పటిలాగే, మారుతి సుజుకి టాప్ 10 జాబితాలో నిలవగా.. అందులో ఆరు మోడళ్లు మారుతివే కావడం విశేషం.

మొదటి రెండు స్థానాల్లో మారుతి మోడల్స్ :
అక్టోబర్‌లో మారుతి సుజుకి వరుసగా 22,080 యూనిట్లు, 20,598 యూనిట్లను విక్రయించి 23 శాతం, 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత టాటా నెక్సాన్ 16,887 యూనిట్లను విక్రయించి 23 శాతం వృద్ధిని నమోదు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

Read Also : Top 10 Deals on Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్.. ఈ టాప్ 10 స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డీల్స్..!

మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్, బ్రెజ్జాతో వరుసగా 16,594 యూనిట్లు, 16,050 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి కింది రెండు స్థానాలను ఆక్రమించింది. మారుతి సుజుకి బ్రెజ్జా 61 శాతం వృద్ధిని సాధించింది. బాలెనో మాత్రం 3 శాతం వృద్ధిని సాధించింది.

మరో రెండు స్థానాల్లో డిజైర్, ఎర్టిగా :

ఆరో స్థానంలో టాటా పంచ్ ఉంది. ఆ తర్వాత మరో రెండు మారుతి సుజుకి మోడల్స్ డిజైర్, ఎర్టిగా ఉన్నాయి. టాటా గత నెలలో పంచ్ 15,317 యూనిట్లను విక్రయించింది. దాంతో 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకి 14,699 డిజైర్, 14,209 ఎర్టిగా యూనిట్లను విక్రయించింది. మహీంద్రా స్కార్పియో 13,578 యూనిట్లను విక్రయించి 83 శాతం వృద్ధితో 9వ స్థానంలో నిలిచింది. టాప్ 10 అమ్మకాల వాహనాలలో చివరి రెండు వాహనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరగా, అక్టోబర్ 2023లో 13,077 యూనిట్లు విక్రయించిన హ్యుందాయ్ క్రెటా 10వ స్థానంలో నిలిచింది.

Top 10 selling cars in October 2023

అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇవే :

మోడల్    అక్టోబర్ 23      అక్టోబర్ 22                   వృద్ధి

వ్యాగన్ ఆర్    22,080    17,945               23శాతం
స్విఫ్ట్            20,598            17,231                20శాతం
నెక్సాన్         16,887        13,767                   23శాతం
బాలెనో         16,594        17,149                   -3శాతం
బ్రెజ్జా           16,050          9,941                    61శాతం
పంచ్           15,317         10,982                  39శాతం
డిజైర్          14,699        12,321                  19శాతం
ఎర్టిగా         14,209      10,494                    35శాతం
స్కార్పియో  13,578      7,438                      83శాతం
క్రెటా           13,077            11,880                 10శాతం

Read Also : Top 10 Cars in October 2023 : అక్టోబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. ఏయే బ్రాండ్ల కార్లు ఉన్నాయంటే?

ట్రెండింగ్ వార్తలు