Top 100cc Mileage Bikes : కొంటే ఇలాంటి బైకు కొనాలి? టాప్ 100CC హై-మైలేజీ బైకులివే.. లీటర్ కొట్టిస్తే 75కి.మీ రేంజ్.. ధర, ఫీచర్లు వివరాలు

Top 100cc Mileage Bikes : మంచి మైలేజీ అందించే బైకు కావాలా? 2026లో భారత మార్కెట్లో టాప్ 100CC బైకుల్లో రోజువారీ రైడింగ్ కోసం అద్భుతమైన బైకులు ఉన్నాయి.. పూర్తి వివరాలివే..

Top 100cc Mileage Bikes

  • కొంటే ఇలాంటి బైకులు కొనాలి భయ్యా
  • టాప్ 100CC మైలేజీ అందించే బైకుల లిస్టు మీకోసం
  • హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100

Top 100cc Mileage Bikes : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? మార్కెట్లో ఏ బైకు కొంటే బెటరా? అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో 2026లో రోజువారీ ప్రయాణానికి, ఆఫీసుకు వెళ్లేందుకు లేదా షాపింగ్ ట్రిప్పులకు చేతిలో బైకు ఉండాల్సిందే.

అందులోనూ తక్కువ లీటరు పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే బైకులు ఉంటే చాలా బెస్ట్ కదా.. అలాంటి బైకులే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మార్చిలో మిడిల్ క్లాసు ఫ్యామిలీల కోసం 100cc సెగ్మెంట్ అద్భుతమైన మైలేజీని అందించే అనేక బైకులు ఉన్నాయి..

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రూ. 57,000 నుంచి రూ.67,000 మధ్య ధరలో ఈ బైక్‌లు లీటరుకు 70 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందించడమే కాకుండా లో మెయింట్ నెన్స్ ఖర్చును కూడా అందిస్తాయి. మీరు కొత్త బైకు కొనాలని అనుకుంటే ఈ బైకులలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ :
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్లో ఫుల్ పాపులర్. రూ. 57,657 ప్రారంభ ధరతో అత్యంత సరసమైన బైకు ఇది. 97.2cc ఇంజన్ నగర ట్రాఫిక్‌లో వేగంగా దూసుకెళ్లగలదు. ఈ బైక్ స్పెషాలిటీ i3S టెక్నాలజీ. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. మళ్లీ క్లచ్ నొక్కిన వెంటనే తిరిగి స్టార్ట్ అవుతుంది. తద్వారా పెట్రోల్ భారీగా ఆదా అవుతుంది.

Read Also : iPhone 17 Pro Max : దిమ్మతిరిగే ఆఫర్ మావా.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్

సుమారుగా లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేవారికి బెస్ట్ బైకు. సీటుపై నిటారుగా కూర్చునేలా ఉంటుంది. లాంగ్ రైడ్ చేసేవారికి ఎలాంటి నడుము నొప్పి వంటి సమస్యలు ఉండవు.

హోండా షైన్ 100 :
మీరు సౌండ్ చేసే బైకుల కన్నా ప్రీమియం రైడ్ కోసం చూస్తుంటే హోండా షైన్ 100 తీసుకోవచ్చు. రూ.65,243 ధరలో ఈ బైక్ క్రోమ్ మెరుగులు, అద్భుతమైన ఫినిషింగ్ కారణంగా లగ్జరీ లుక్ ఉంటుంది. 98.98cc PGM-FI ఇంజన్ చాలా సైలెంట్ ఉంటుంది. ఇంజిన్ రన్ అవుతున్న సౌండ్ కూడా మీకు వినిపించదు.

హోండా eSP (ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్) టెక్నాలజీ ఎలాంటి సౌండ్ లేకుండా నాయిజ్ లేకుండా ఉంటుంది. ఈ బైకు మైలేజీ లీటరుకు సుమారు 65 కిలోమీటర్లు అందిస్తుంది. ఇతర బైకుల కన్నా కొద్దిగా తక్కువగా మైలేజీ ఉన్నా క్లీన్, లో మెయింట్ నెన్స్ ఖర్చు కారణంగా ప్రీమియం ఆప్షన్ అని చెప్పవచ్చు.

బజాజ్ ప్లాటినా 100 :
బజాజ్ ప్లాటినా 100 రోజంతా రోడ్డుపై ప్రయాణించేవారికి బెస్ట్ బైక్. రూ. 66,015 ధరలో ఈ బైక్ లీటరుకు 75 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. మైలేజ్ విషయంలో ఈ బైకుకు తిరుగులేదనే చెప్పాలి.

ప్లాటినా కంఫర్టెక్ (SNS) సస్పెన్షన్. ‘స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్’ షాక్ అబ్జార్బర్‌లు, రోడ్డు గుంతలుగా ఉన్నా కూడా తట్టుకోగలదు. లాంగ్ సీటు ఇద్దరు వ్యక్తులు కూర్చొనేలా చాలా కంపర్ట్ అందిస్తుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ డేటైమ్ కూడా స్పష్టంగా కనిపించేలా సేఫెస్ట్ డిజైన్ అయింది.