×
Ad

Top 4K Smart TVs : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌.. టాప్ 3 4K స్మార్ట్‌టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన టీవీ ఇంటికి తెచ్చుకోండి!

Top 4K Smart TVs

Flipkart Big Bang Diwali Sale : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ 4K రిజల్యూషన్‌ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో 53శాతం వరకు తగ్గింపుతో టాప్ 3 4K స్మార్ట్ టీవీలను డిస్కౌంట్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలు అద్భుతమైన సౌండ్ అవుట్‌పుట్, రిఫ్రెష్ రేట్లతో వస్తాయి.

ఈ స్మార్ట్ టీవీలలో నెట్‌ఫ్లిక్స్, జియో, హాట్‌స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఇతర OTT ప్లాట్‌ఫామ్ సపోర్టుతో అల్ట్రా HD 4K రిజల్యూషన్‌ను అందిస్తాయి. భారీ డిస్కౌంట్ (Flipkart Big Bang Diwali Sale) తర్వాత ఈ స్మార్ట్ టీవీలు ఎంత ధరకు కొనుగోలు చేయొచ్చు? ఏయే ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. థామ్సన్ ఫీనిక్స్ QLED అల్ట్రా HD 4K (43-అంగుళాలు) :
థామ్సన్ ఫీనిక్స్ 43-అంగుళాల QLED అల్ట్రా హెచ్‌డీ 4K స్మార్ట్‌టీవీ 40W సౌండ్ అవుట్‌పుట్, 60Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో, హాట్‌స్టార్, యూట్యూబ్-సపోర్ట్ యాప్‌లను యాక్సస్ చేయొచ్చు.

స్మార్ట్ హోమ్ డివైజ్‌ల కోసం వాయిస్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. పర్సనలైజడ్ కంటెంట్‌ ఆప్షన్ కూడా ఉంది. మీరు 10వేలకు పైగా యాప్‌లు, గేమ్‌లను యాక్సస్ చేయొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఈ స్మార్ట్ టీవీ 53శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంటే.. కేవలం రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Hyundai Diwali Discounts : వారెవ్వా.. హ్యుందాయ్ దీపావళి ఆఫర్లు.. వెన్యూ, ఎక్స్‌టర్, అల్కాజార్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో మీ ఇష్టం..!

2. షావోమీ Mi ఎఫ్ సిరీస్ (43-అంగుళాలు) :

షావోమీ అందించే Mi ఎఫ్ సిరీస్ స్మార్ట్‌టీవీ కూడా 43-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. మీరు అల్ట్రా HD 4K రిజల్యూషన్ డిస్‌ప్లే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 24W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్‌ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

అద్భుతమైన 4K డిస్‌ప్లే, 32GB స్టోరేజ్, డాల్బీ ఆడియో సౌండ్ లిజనింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో కావాల్సినంత కంటెంట్ ఉంది. మీకు నచ్చిన కంటెంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ రూ. 37,999 ధరకు లిస్టు అయింది. 48శాతం తగ్గింపుతో ఈ టీవీని కేవలం రూ. 19,499కే పొందవచ్చు.

3. శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ (43-అంగుళాలు) :
శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ స్మార్ట్ టీవీ 43-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో అల్ట్రా హెచ్‌డీ 4K రిజల్యూషన్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ నెట్‌ఫ్లిక్స్, జియో, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్,జీ5, ఆపిల్ టీవీ ప్లస్, సోనీ లైవ్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో టైజెన్ (Tizen) ఆపరేటింగ్ సిస్టమ్‌ కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌‌టీవీ 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. చాలా తక్కువ ఉంటుంది. స్పీకర్‌లు కనెక్ట్ చేసుకుంటే సౌండ్ పెరుగుతుంది. ఈ స్మార్ట్‌టీవీ 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. శాంసంగ్ క్రిస్టల్ UHD ప్రాసెసర్ 4K కలిగి ఉంది. శాంసంగ్ Knox సేఫ్టీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని కొనుగోలుపై 37శాతం తగ్గింపుతో కేవలం రూ.25,750కే ఇంటికి తెచ్చుకోవచ్చు.