Hyundai Diwali Discounts : వారెవ్వా.. హ్యుందాయ్ దీపావళి ఆఫర్లు.. వెన్యూ, ఎక్స్‌టర్, అల్కాజార్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో మీ ఇష్టం..!
Hyundai Diwali Discounts : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. దీపావళి పండగ సేల్స్ సమయంలో హ్యుందాయ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Hyundai Diwali Discounts
Hyundai Diwali Discounts : కొత్త కారు కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఈ పండగ సీజన్‌లో అత్యంత సరసమైన ధరకే కార్లను కొనేసుకోవచ్చు. ఇటీవల జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడంతో కార్ల ధరలు మరింత చౌకగా మారాయి. దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుదారులు పండుగ ఆఫర్ల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మీరు కూడా పండగ అమ్మకాల్లో కొత్త కారు కొనాలనుకుంటే సరైన సమయం.
హ్యుందాయ్ కొత్త ఫీచర్లతో పాపులర్ మోడళ్లపై (Hyundai Diwali Discounts) డిస్కౌంట్ అందిస్తోంది. ఈ దీపావళి సేల్ సమయంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి 3 వరుసల సీటింగ్ SUV వరకు, హ్యుందాయ్ పండుగ డిస్కౌంట్లు, ఫీచర్లు రెండు కోరుకునే కొనుగోలుదారులకు అద్భుతమైన డీల్స్ అని చెప్పొచ్చు. ప్రతి మోడల్ ఏయే డిస్కౌంట్లతో వస్తుంది? డిస్కౌంట్ పరంగానే కాకుండా ఆటోమొబైల్ ఫీచర్లు, ఫీచర్ల పరంగా కూడా ఏమి అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ :
జీఎస్టీ తగ్గింపు రూ. 73,808
అదనపు బెనిఫిట్స్ : రూ. 55,000
లాంచ్ ధర : రూ. 5,47,278
గ్రాండ్ i10 నియోస్ మోడల్ కారు స్టైలిష్, డ్రైవింగ్, ఈజీ హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం టచ్ కోసం చూసే సిటీ రైడర్లను ఆకర్షిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, కనెక్ట్ కార్ టెక్, వైర్‌లెస్ ఛార్జింగ్ రన్నింగ్ ఖర్చులకు ప్రాధాన్యతనిచ్చే వారికి సీఎన్‌జీ మోడల్ అద్భుతమైన ఆప్షన్. నియోస్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఈ పండుగ తగ్గింపుతో లభిస్తోంది.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇంజిన్ ఆప్షన్లు : 1.2లీ పెట్రోల్/సీఎన్‌జీ
ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మాన్యువల్/AMT
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ : స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 8-అంగుళాలు
సేఫ్టీ : డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు
హ్యుందాయ్ వెన్యూ :
జీఎస్టీ తగ్గింపు : రూ. 1,23,659
అదనపు బెనిఫిట్స్ : రూ. 50,000
లాంచ్ ధర : రూ. 7,26,381
హ్యుందాయ్ మోస్ట్ పాపులర్ కార్లలో ఇదొకటి. హ్యుందాయ్ వెన్యూ మల్టీ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది. ఇందులో ఒకటి టార్క్వీ. 1.0-లీటర్ టర్బో పెట్రోల్. ఈ SUV ఫీచర్ల పరంగా సన్‌రూఫ్, డిజిటల్ క్లస్టర్, కనెక్ట్ టెక్, 6 ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపుతో పాటు రూ. 1.7 లక్షలకు పైగా బెనిఫిట్స్ పొందవచ్చు. దీపావళి కొనుగోలుదారులకు వెన్యూ మోడల్ బెస్ట్ ఆప్షన్.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇంజిన్ ఆప్షన్లు : 1.2లీ పెట్రోల్, 1.0లీ టర్బో పెట్రోల్, 1.5లీ డీజిల్
ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/డీసీటీ
ఇన్పోటైన్మెంట్ : బ్లూలింక్‌తో 8-అంగుళాల కనెక్ట్ టచ్‌స్క్రీన్
సేఫ్టీ : 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సీ, హిల్ అసిస్ట్
హ్యుందాయ్ ఆరా :
జీఎస్టీ తగ్గింపు : రూ. 78,465
అదనపు బెనిఫిట్స్ : రూ. 43,000
లాంచ్ ధర : రూ. 5,98,320
ఆరా సెడాన్ కాంపాక్ట్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. వైడ్ క్యాబిన్, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, సెగ్మెంట్-ఫస్ట్ వంటి స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఖర్చుకు వెనకడాని వినియోగదారులకు CNG మోడల్ బెటర్ ఆప్షన్.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇంజిన్ ఆప్షన్లు : 1.2లీ పెట్రోల్/సీఎన్‌జీ
ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/AMT
ఇన్ఫోటైన్మెంట్ : 8-అంగుళాల టచ్‌స్క్రీన్
సెక్యూరిటీ : 4 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్, ABS, రియర్ కెమెరా
హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
జీఎస్టీ తగ్గింపు : రూ. 51,158
అదనపు బెనిఫిట్స్ : రూ. 45,000
లాంచ్ ధర : రూ. 5,48,742
హ్యుందాయ్ అతి చిన్న SUV ఎక్స్‌టర్, యువత లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చింది. డాష్‌క్యామ్, సన్‌రూఫ్, మల్టీ డ్రైవింగ్ మోడ్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఎంట్రీ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇంజిన్ ఆప్షన్లు : 1.2లీ పెట్రోల్/సీఎన్‌జీ
ట్రాన్స్‌మిషన్ మాన్యువల్/AMT
ప్రత్యేక ఫీచర్లు : ఇంటర్నల్ డాష్‌క్యామ్, సన్‌రూఫ్ (టాప్ వేరియంట్)
సెక్యూరిటీ : 6 ఎయిర్‌బ్యాగులు
హ్యుందాయ్ i20 :
జీఎస్టీ తగ్గింపు : రూ. 98,053
అదనపు బెనిఫిట్స్ : రూ. 55,000
లాంచ్ ధర : రూ. 6,86,865
బోస్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైడ్ సెకండ్ వరుసతో i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డ్రైవింగ్ డైనమిక్స్‌తో అద్భుతంగా ఉంటుంది. పండుగ ఆఫర్‌లతో ధర పరంగా ఇప్పుడు కాంపాక్ట్ సెడాన్ తగ్గింపు ధరకే లభిస్తోంది.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇంజిన్ ఆప్షన్లు : 1.2లీ పెట్రోల్ / 1.0లీ టర్బో పెట్రోల్
ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్/CVT/DCT
ఇన్ఫోటైన్మెంట్ : బోస్ ఆడియోతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
సెక్యూరిటీ : 6 ఎయిర్‌బ్యాగులు, ESC, TPMS
హ్యుందాయ్ అల్కజార్ :
జీఎస్టీ తగ్గింపు : రూ. 75,376
అదనపు బెనిఫిట్స్ : రూ. 60,000
ప్రారంభ ధర : రూ. 14,47,305
ఫుల్ సైజ్ సెగ్మెంట్ ఫీచర్లతో 3 వరుసల సీట్ల ఎస్‌యూవీ కోసం చూస్తున్న ఫ్యామిలీల కోసం అల్కాజార్ కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, డీజిల్‌తో సహా మల్టీ పవర్‌ట్రెయిన్‌లను అందిస్తుంది. రూ. 1.3 లక్షకు పైగా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో అల్కాజార్ కారు అత్యంత ఆకర్షణీయంగా మారింది.
కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
సీటింగ్ కాన్ఫిగరేషన్ : 6, 7-సీట్ల ఆప్షన్లు
ఇంజిన్ ఆప్షన్లు : 1.5లీ టర్బో పెట్రోల్ / 1.5లీ డీజిల్
ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్ / ఆటోమేటిక్
ఫీచర్లు : పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా