Affordable Electric Cars
Affordable Electric Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. రూ. 10 లక్షల బడ్జెట్ ధరలో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ కారు కొనేసుకోవచ్చు. రూ. 10 లక్షల బడ్జెట్‌లో 3 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
ఎంజీ కామెట్ ఈవీ :
రూ. 10 లక్షల బడ్జెట్ లోపు ధరలో అత్యంత సరసమైన ఈవీలలో ఎంజీ కామెట్ ఈవీ ఒకటి. ఎంజీ కామెట్ ఈవీ రూ. 7.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ నుంచి 260 కి.మీ వరకు ప్రయాణించగలదు.
టాటా టియాగో ఈవీ :
టాటా మోటార్స్ నుంచి టాటా టియాగో ఈవీ తక్కువ ధరకే లభిస్తోంది. టాటా టియాగో ఈవీ కారు రూ.7.99 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈవీ కారు మీ రూ. 10 లక్షల బడ్జెట్‌లో కొనేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ నుంచి 315 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.
టాటా పంచ్ ఈవీ :
టాటా పంచ్ ఈవీ కూడా సరసమైన ధరకే లభిస్తుంది. అయితే, టాటా పంచ్ ఈవీ రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి లభ్యమవుతుంది. మీరు ఈ కారు కొనాలంటే కొద్దిగా ఎక్కువ బడ్జెట్ పెంచుకోవాలి. ఈవీ ఆన్-రోడ్ ధర రూ. 10 లక్షల కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. టాటా పంచ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ వరకు దూసుకెళ్తుంది.