Top 4 Electric Cars : రూ. 10 లక్షల్లో కొత్త EV కారు.. టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్‌లో ఏది కింగ్?
Top 4 Electric Cars : టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ, టాటా పంచ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్ మోడళ్లు రూ. 10 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లు తక్కువ ప్రారంభ ధరలకే BaaS ఆప్షన్ కూడా అందిస్తున్నాయి.
- Sreehari A
- Published on- August 22, 2026 / 05:43 PM IST
Top 4 Electric Cars
- రూ. 10 లక్షల లోపు EV కొనాలని చూస్తున్నారా?
- మీకోసం టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు లిస్టు ఇదే
- కొన్ని EV మోడళ్లు BaaS ఆప్షన్‌తో తక్కువ ధరకే లభ్యం
- 315కి.మీ వరకు రేంజ్ అందించే మోడళ్లు ఉన్నాయి
Top 4 Electric Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్, డీజిల్ కారు ఎందుకు? ఎలక్ట్రిక్ కారు కొందామని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీ బడ్జెట్ రూ. 10 లక్షల లోపు ఉంటే భారత మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనంతగా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఇప్పుడు చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లు మాత్రమే కాదు.. మైక్రో ఈవీలు కాంపాక్ట్ ఎస్‌యూవీల వంటి మోడళ్లు కూడా లభిస్తున్నాయి.
కొన్ని కార్ల ధరలో బ్యాటరీతో కలిపి ఉంటుంది. మరికొన్ని తక్కువ ప్రారంభ ధరకే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. BaaS మోడల్ కింద బ్యాటరీ పూర్తి ఖర్చు వినియోగాన్ని బట్టి స్పెషల్ ఛార్జీ ఉంటుంది. అందుకే ఏదైనా ఎలక్ట్రిక్ కారు ధరను కేవలం ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా కంపేర్ చేయొద్దు.
ఎలక్ట్రిక్ కారు కొనేటప్పుడు డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫీచర్లు బ్యాటరీ వారంటీ (Top 4 Electric Cars) వంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. మీ బడ్జెట్ రూ. 10 లక్షల వరకు ఉంటే ఈ ధర రేంజ్ కొనుగోలు చేయగల ఎలక్ట్రిక్ కార్లను ఇప్పుడు చూద్దాం..
బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఏంటి? :
ముందుగా, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌లో కస్టమర్ కారుకు బ్యాటరీకి సపరేట్ చెల్లించాలి. మీ కొత్త ఈవీ కారు ప్రారంభ ధర మాత్రమే తగ్గుతుంది. కానీ, బ్యాటరీకి నెలవారీగా సబ్‌స్క్రిప్షన్ లేదా కిలోమీటరుకు విడిగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే BaaS ధరకి బ్యాటరీతో ఎక్స్-షోరూమ్ ధరకి మధ్య చాలా తేడా ఉంటుంది.
భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే :
టాటా టియాగో ఈవీ :
భారత మార్కెట్లో టాటా టియాగో ఈవీ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఇందులో భారీ బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ల వరకు MIDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరను మరింత తగ్గించుకోవచ్చు. టియాగో ఈవీని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ మోడల్‌లో బ్యాటరీకి సపరేట్ ధర ఉంటుంది. మీరు తీసుకునే ప్లాన్‌ను బట్టి అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎంజీ కామెట్ ఈవీ :
ఎంజీ కామెట్ ఈవీ ధర సుమారుగా రూ. 7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 17.3kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 230 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్ సైజు, ఈజీ డ్రైవింగ్ మాత్రమే కాదు.. రోజువారీ సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్ కూడా..
టాటా పంచ్ ఈవీ :
మీరు SUV లాంటి డిజైన్‌తో ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? టాటా పంచ్ ఈవీ బెస్ట్ ఆప్షన్. ఈ కారు ధరల రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బేస్ వేరియంట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది 315 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పంచ్ ఈవీలో అనేక అడ్వాన్స్ సెక్యూరిటీ కనెక్టెడ్ కారు ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ :
ఈ ఎంజీ ఈవీ కారు సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షలకుపైగా ఉంటుది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో కూడా పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 10 లక్షల కన్నా తక్కువకే వస్తుంది. ఈ మోడల్‌లోని బ్యాటరీకి కిలోమీటరుకు స్పెషల్ రుసుము లేదంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. విండ్సర్ ఈవీ వైడ్ క్యాబిన్, ప్రీమియం ఫీచర్లు లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌కు బెస్ట్ ఈవీ కారు అని చెప్పొచ్చు.
