Top 4 Maruti Suzuki Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. టాప్ 4 మారుతి సుజుకి కార్లు మీకోసం.. ఏది కొంటారో మీఇష్టం..!

Top 4 Maruti Suzuki Cars : మారుతి సుజుకి కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. 2025లో లేటెస్ట్ ఫీచర్లు, స్మార్ట్ అప్ గ్రేడ్ లతో ఉన్నాయి.

Top 4 Maruti Suzuki Cars

Top 4 Maruti Suzuki Cars : కొత్త కారు కోసం చూస్తున్నారా? లేటెస్ట్ ఫీచర్లతో మారుతి సుజుకి కార్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా భారతీయ వినియోగదారులలో (Top 4 Maruti Suzuki Cars) పోటీ ధరలకు అందించే నమ్మకమైన కార్లుగా పేరొందాయి. 2025లో మారుతి సుజుకి అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు, అధునాతన భద్రతా వ్యవస్థలు, స్మార్ట్ కనెక్టివిటీతో కూడిన వాహనాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటూనే ఉంది.

హ్యాచ్‌బ్యాక్‌లు లేదా ఎస్ యూవీ అయినా, మారుతి సుజుకి డ్రైవింగ్‌ సురక్షితంగా ఉండేలా అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. మారుతి సుజుకి అందించే అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన టాప్ 4 మారుతి సుజుకి కార్లను ఓసారి పరిశీలిద్దాం..

మారుతి సుజుకి బ్రెజ్జా :

మారుతి సుజుకి బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్ యూవీ. 2025 బ్రెజ్జా మోడల్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. వాయిస్ కమాండ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే.. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. బ్రెజ్జా అనేది అడ్వాన్స్ సౌకర్యాలతో పాటు స్మూత్ డ్రైవ్, సౌకర్యవంతమైన క్యాబిన్‌తో ఆధునిక అర్బన్ ఎస్ యూవీ మోడల్ కారు.

Read Also : OPPO F27 Pro Plus : వాటర్ ప్రూఫ్ ఫోన్ కావాలా? ఒప్పో F27 ప్రో ప్లస్ ధర తగ్గిందోచ్.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

మారుతి సుజుకి బాలెనో :
భారత మార్కెట్లో మారుతి బాలెనో అత్యంత పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌. లేటెస్ట్ మోడల్‌లో 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హెడ్‌లైట్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్‌లు, స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీకి సంబంధించినంతవరకు కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. బాలెనో సిటీ డ్రైవింగ్, సౌకర్యం, స్టయిల్, టెక్నాలజీ కోసం అన్ని ఫీచర్లను కలిగి ఉంది.

మారుతి సుజుకి డిజైర్ :
మారుతి డిజైర్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో స్టైలిష్ స్మాల్ సెడాన్‌గా మారింది. 7-అంగుళాల టోర్నాడో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ కమాండ్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో వస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్ల మాదిరిగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీతో రోజువారీ ఉపయోగానికి లాంగ్ డ్రైవ్‌లకు అద్భుతమైన కారుగా చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఎర్టిగా :
మారుతి ఎర్టిగా అనేది ఇప్పుడు ఫుల్ లిస్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్‌ ఎంపీవీ కారు. మీరు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటితో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హై ట్రిమ్‌లలో కెప్టెన్ సీట్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈబీడీతో ఏబీఎస్ మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అత్యంత ఆధునిక టెక్నాలజీతో పాటు ఫ్యామిలీలకు ఎర్టిగా మోడల్ కారు సరిగ్గా సరిపోతుంది.