×
Ad

2025 Year-End Discounts : ఇప్పుడే కొనడం బెటర్.. ఈ టాప్ 5 SUVలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు.. ఏ కారుపై డిస్కౌంట్ ఎంతంటే?

2025 Year-End Discounts : ఇయర్ ఎండ్ డిస్కౌంట్లతో కొత్త కారు కొనేసుకోండి. భారతీయ మార్కెట్లో ఈ SUV కార్లపై అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు. డిసెంబర్ 2025లో లభ్యమయ్యే టాప్ డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి.

2025 Year-End Discounts

2025 Year-End Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2025 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అనేక టాప్ రేంజ్ కార్ బ్రాండ్లు తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రత్యేకించి SUV కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి ఏడాది ప్రారంభంలో వాహన తయారీదారులు (2025 Year-End Discounts) కార్ల ధరలను అమాంతం పెంచేస్తారు. కొత్త ధరలు పెంపుకు ముందుగానే పాత కార్ల స్టాక్ క్లియర్ చేసేందుకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయి. మీరు కూడా కొత్త కారు కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. మీరు SUV మోడళ్లపై అదిరిపోయే డీల్స్ పొందవచ్చు. డిసెంబర్ 2025లో లభ్యమయ్యే టాప్ డిస్కౌంట్లను ఓసారి లుక్కేయండి.

1. స్కోడా కుషాక్.. రూ. 3.25 లక్షల వరకు డిస్కౌంట్ :
స్కోడా ఫేస్‌లిఫ్టెడ్ కుషాక్‌ను రెడీ చేస్తోంది. 2026 జనవరిలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ప్రస్తుత-స్పెక్ మోడల్ డిసెంబర్ 2025లో రూ. 3.25 లక్షల వరకు డిస్కౌంట్లతో లభ్యమవుతుంది. ముఖ్యంగా, అన్ని మాస్-మార్కెట్ SUV కార్లలో అత్యధిక ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ఇదే.

స్కోడా కుషాక్ కారు మొత్తం 2 ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 115hp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ధర రూ. 10.61 లక్షల నుంచి రూ. 16.89 లక్షల మధ్య, 150hp 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ధర రూ. 17.13 లక్షల నుంచి రూ. 18.43 లక్షల మధ్య ఉంటుంది.

2. జీప్ కంపాస్.. రూ. 2.55 లక్షల వరకు డిస్కౌంట్ :
ఈ జాబితాలో జీప్ కంపాస్ మరో SUV కారు. ధర రూ. 2 లక్షలకు పైగా ఉంటుంది. ఇందులో రూ. 1.30 లక్షల నుంచి ఆఫర్లు, రూ. 1.10 లక్షల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్, రూ. 15వేల వరకు ప్రత్యేక బెనిఫిట్స్ ఉన్నాయి. తద్వారా మొత్తం రూ. 2.55 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.

కంపాస్ 170hp, 350Nm ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) ఆప్షన్అందించే రెండు మోడళ్లలో ఇదొకటి. కంపాస్ ధరలు రూ. 17.73 లక్షల నుంచి రూ. 26.45 లక్షల మధ్య ఉంటాయి.

Read Also : Buy Buy Sale 2025 : వారెవ్వా.. గూగుల్ పిక్సెల్ 10పై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే..!

3. వోక్స్‌వ్యాగన్ టైగన్.. రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు :
స్కోడా కుషాక్ బ్యాడ్జ్-ఇంజనీరింగ్ వెర్షన్ వోక్స్వ్యాగన్ టైగన్ మోడల్ కారు రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు.. వోక్స్వ్యాగన్ బేస్-స్పెక్ కంఫర్ట్లైన్ మోడల్‌ను రూ. 10.58 లక్షల తక్కువ ధరకు అందిస్తోంది. టైగన్ కుషాక్ మాదిరిగానే టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. కానీ, 1.5-లీటర్ ఆప్షన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. వోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 11.39 లక్షల నుంచి రూ. 19.15 లక్షల మధ్య ఉంటాయి.

4. హోండా ఎలివేట్ రూ. 1.76 లక్షల వరకు డిస్కౌంట్ :
భారత ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ తయారీదారుల ఏకైక SUV మోడల్ హోండా ఎలివేట్ ధర రూ.11 లక్షల నుంచి రూ.16.47 లక్షల మధ్య లభ్యమవుతుంది. డిసెంబర్ 2025లో రూ.1.76 లక్షల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఎలివేట్ పాపులర్ హోండా సిటీ సెడాన్ మాదిరిగానే 1.5-లీటర్ VTEC పెట్రోల్ ఇంజిన్‌ కూడా కలిగి ఉంది. మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది.

5. నిస్సాన్ మాగ్నైట్ : రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్ :
నిస్సాన్ మాగ్నైట్ సరసమైన కాంపాక్ట్ SUV మోడల్. డిస్కౌంట్లు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. దక్షిణ భారత్‌లో ఈ కార్లపై డిస్కౌంట్లు రూ. 1.36 లక్షల వరకు, తూర్పు ప్రాంతాలలో రూ. 1.25 లక్షల వరకు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో రూ. 1.20 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. రూ. 5.62 లక్షల నుంచి రూ. 10.76 లక్షల వరకు ధరతో మాగ్నైట్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ కలిగి ఉన్నాయి.