Buy Buy Sale 2025 : వారెవ్వా.. గూగుల్ పిక్సెల్ 10పై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే..!
Buy Buy Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బైబై సేల్ 2025 సందర్భంగా గూగుల్ పిక్సెల్ 10పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఇయర్ ఎండ్ ఆఫర్ ఎలా పొందాలంటే?
Buy Buy Sale 2025
Buy Buy Sale 2025 : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బైబై సేల్ 2025 పేరుతో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. మీరు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం అప్లియన్సెస్ సహా అనేక డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు.
ఇందులో అత్యంత ఆకర్షణీయమైన (Buy Buy Sale 2025) ఆఫర్ గూగుల్ పిక్సెల్ 10పై అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు ఈ పిక్సెల్ ఫోన్ దాదాపు రూ. 9వేలు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే డీల్ అసలు వదులుకోవద్దు. ఈ లిమిట్ ఆఫర్ ఎలా పొందాలంటే?
12GB ర్యామ్ వేరియంట్‌పై డిస్కౌంట్ :
ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో రూ.79,999కి లిస్ట్ అయింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో 17శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అసలు ధర నుంచి రూ. 70,200కు కొనుగోలు చేయొచ్చు. బ్యాంకు డిస్కౌంట్లతో ఈ పిక్సెల్ 10 ఫోన్ ధరపై మరింత తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐలు :
ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ బ్యాంక్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, మీరు HDFC క్రెడిట్ కార్డులపై రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు అన్ని నిబంధనలు, షరతులకు లోబడి రూ. 68,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీరు రూ. 2,998కి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఓఎల్ఈడీ డిస్‌ప్లే :
అత్యధికంగా అమ్ముడైన ఈ పిక్సెల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.3-అంగుళాల OLED స్క్రీన్ కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 3,000 నిట్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజీ :
స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
గ్రేట్ సెల్ఫీ క్లిక్ :
కెమెరా, వీడియో కోసం ఈ పిక్సెల్ ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10.8MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా కలిగి ఉంది.
బ్యాటరీ బ్యాకప్ :
పవర్ విషయానికొస్తే.. ఈ పిక్సెల్ 10 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,970mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది.
