Best Camera Phones : మంచి కెమెరా ఫోన్ కావాలా? 2025లో వచ్చిన 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
Best Camera Phones : స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ సినిమాటిక్ కెమెరా ఫోన్ల నుంచి శాంసంగ్, వివో జూమ్ కెమెరాల వరకు 2025లో లాంచ్ అయిన 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Best Camera Phones : కొత్త కెమెరా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2025 ఏడాదిలో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అందులో ప్రధానంగా ఫొటోగ్రఫీకి అద్భుతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ నుంచి ఒప్పో ఫైండ్ X9 ప్రో, వివో X300 ప్రో వరకు కెమెరా పవర్‌హౌస్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అన్ని ఫోన్లలో అదిరిపోయే కెమెరా ఫీచర్లు కలిగిన 5 అద్భుతమైన కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (రూ. 1,49,900) : 2025లో లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్ సెన్సార్-షిఫ్ట్ OISతో 48MP మెయిన్ సెన్సార్, 4x ఆప్టికల్ జూమ్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. అడ్వాన్స్ ట్రిపుల్-లెన్స్ సెటప్ కలిగి ఉంది. అద్భుతమైన కెమెరా ఫ్లాగ్‌షిప్‌లలో ఫోన్లలో ఇదొకటి. డాల్బీ విజన్ HDR, ProRes, ఆపిల్ లాగ్ 2, స్పేషియల్ వీడియో LiDAR స్కానర్‌తో మల్టీఫేస్ ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజింగ్ ఫీచర్లను అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,07,999) : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ద్వారా అద్భుతమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది. 8K వీడియో HDR10+ సపోర్టుతో పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. 2025లో రిలీజ్ అయిన బెస్ట్ కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి.

వివో X300 ప్రో (రూ. 1,09,999) : 2025లో టాప్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో వివో X300 ప్రో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ OISతో 50MP వైడ్ సెన్సార్, 3.7x ఆప్టికల్ జూమ్, మాక్రో సామర్థ్యంతో భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ షూటర్ కలిగి ఉంది. పవర్‌ఫుల్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. జీసెస్ ఆప్టిక్స్, 8K వీడియో, డాల్బీ విజన్ HDR, 50MP 4K సెల్ఫీ కెమెరాతో ఫొటోగ్రఫీ ప్రో-లెవల్ వీడియో పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో 50MP మెయిన్ సెన్సార్, 5x జూమ్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ లెన్స్‌తో టాప్-టైర్ ఇమేజింగ్ అందిస్తుంది. 42MP సెల్ఫీ కెమెరాతో 4K రికార్డింగ్‌కు సపోర్టు అందిస్తుంది.గూగుల్ పవర్‌ఫుల్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ సపోర్టుతో 2025లో లాంచ్ అయిన అత్యంత ఆకట్టుకునే కెమెరా ఫోన్‌లలో ఇదొకటి.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) : 2025లో రిలీజ్ అయిన అత్యుత్తమ కెమెరా ఫ్లాగ్‌షిప్‌లలో ఒప్పో ఫైండ్ X9 ప్రో ఒకటి. మల్టీఫేస్ ట్రిపుల్ సెటప్ OISతో 50MP ప్రైమరీ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ కలిగి ఉంది. హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్, లేజర్ AF, డాల్బీ విజన్ వీడియో, LOG రికార్డింగ్, 50MP 4K సెల్ఫీ కెమెరా ఫొటోగ్రఫీకి పవర్‌హౌస్‌గా చెప్పొచ్చు.
