×
Ad

Post Office Schemes : మీకు ఈ నెల జీతం పడిందా? పోస్టాఫీసులో 5 అద్భుతమైన స్కీమ్స్.. ఇలా ఇన్వెస్ట్ చేశారంటే హై రిటర్న్స్ పక్కా..!

Post Office Schemes : పెట్టుబడి పెట్టేవారికి గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో మంచి రాబడిని అందించే పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఏయే పథకాల్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంటే?

1/9
Post Office Schemes : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, వెంటనే ఈ పనిచేయండి.. ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఏదో ఒకదానిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికపరంగా లోటు లేకుండా బతికేయొచ్చు. ఇన్వెస్ట్ అనగానే రిస్క్ ఉంటుందని భయపడిపోతుంటారు. వాస్తవానికి, 2025 ఏడాదిలో క్యాపిటల్ మార్కెట్లలో భారీగా అస్థిరతను చవిచూసింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సుంకాల యుద్ధాలు పెట్టుబడిదారులలో అనిశ్చితిని సృష్టించాయి. ఫలితంగా, చాలా మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ పథకాలు గత ఏడాదిలో ప్రతికూలమైన తక్కువ సింగిల్-డిజిట్ రాబడిని అందించాయి.
2/9
ఫలితంగా అనేక మంది ఇన్వెస్టర్లు స్థిరమైన మెరుగైన రాబడిని అందించే పథకాల వైపే మెగ్గు చూపుతున్నారు. మీరు కూడా రిస్క్ లేని పథకాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీకోసం పోస్టాఫీసు అందించే 5 అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. కనీసం 7.5శాతం నుంచి గరిష్టంగా 8.2శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తాయి. డిసెంబర్ త్రైమాసికానికి పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ పథకాల్లో పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే గ్యారెంటీ ప్రాఫిట్ అందిస్తాయి. మీరు కూడా పోస్టాఫీసులో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఓసారి ఈ స్టోరీ చదవండి.
3/9
పోస్టాఫీసులో 5 సేవింగ్స్ పథకాలివే : పోస్టాఫీసులో ఈ పథకాలు వంద శాతం భద్రతతో పాటు స్థిర ఆదాయాన్ని అందిస్తాయి. క్యాపిటల్ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. అందుకే ఈ పథకాలు సీనియర్ సిటిజన్లు, బాలికలకు అత్యధిక రాబడిని తెచ్చిపెడతాయి. ఇంతకీ పోస్టాఫీసు అందించే ఏయే పథకాలు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/9
1. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : సీనియర్ సిటిజన్లకు అత్యంత ఆకర్షణీయమైన పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకం కింద ఏడాదికి 8.2శాతం అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం 5 ఏళ్లకు మెచ్యూరిటీ చెందుతుంది. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు. అయితే, ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన వడ్డీ రూ. 50వేలు దాటితే, TDS (పన్ను మినహాయింపు) కట్ అవుతుంది.
5/9
2. సుకన్య సమృద్ధి యోజన (SSY) : ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ పథకం ఏడాదికి 8.2శాతం అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకం EEE (మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు) వర్గంలోకి వస్తుంది. అంటే.. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సంపాదించిన వడ్డీపై కూడా టాక్స్ చెల్లించాల్సిన పని ఉండదు. మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను పడదు.
6/9
3. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ (NSC) : ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ 5 ఏళ్లు ఉంటుంది. ఏడాదికి 7.7శాతం స్థిరమైన రాబడిని అందిస్తుంది. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా చేసేవారికి అద్భుతమైన పథకం.
7/9
4. కిసాన్ వికాస్ పత్ర (KVP) : కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం కింద ఏడాదికి 7.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 115 నెలల్లో (సుమారు 9 ఏళ్ల 7 నెలలు) మీరు పెట్టుబడిన పెట్టిన డబ్బు గ్యారెంటీగా రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలు లేవు. కానీ, తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీని సంపాదించుకోవచ్చు.
8/9
5. టైమ్ డిపాజిట్ (TD) 5 ఏళ్లు : 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ (TD) పథకం ఏడాదికి 7.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం కూడా. స్థిర ఆదాయం కోసం చూసేవారికి అద్భుతమైన పథకం. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లలో రూ. 40వేలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ సంపాదిస్తే TDS కట్ అవుతుంది. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ. 50వేల వరకు ఉంటుంది.
9/9
Disclaimer : ఈ పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేముందు పోస్టాఫీసులో సంప్రదించి ఆ తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోండి.