Bao Fan: చైనాలో మరో జాక్ మా.. చైనీస్ టాప్ ఇన్వెస్ట్‭మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ గల్లంతు

ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 50 శాతం పతనమయ్యాయి. బావో ఫాన్ 1990వ దశకంలో ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూసీలలో ఆయన కెరీర్ సాగింది. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అడ్వయిజర్‌గా పని చేశారు. ఇద్దరితో కలిసి చైనా రినయ్‌సెన్స్‌ను 2005లో ప్రారంభించారు

Bao Fan: కమ్యూనిస్ట్ పార్టీ పానలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొంత కాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఉన్నట్టుండి గల్లంతు అయ్యారు. ఇలా జరగడానికి కొద్ది రోజుల ముందే ఆయన జిన్‭పింగ్ ప్రభుత్వ బ్యాంకింగ్ విధానాలపై విమర్శలు చేశారు. జాక్ మా ఏమయ్యారో, అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. తాజాగా ఆయన చైనా విడిచి వెళ్లారని, జపాన్‭లో నివసిస్తున్నట్లు తెలిసింది.

Priyanka Chaturvedi: బీజేపీ తదుపరి టార్గెట్ అదే.. ఇక మనకి సుప్రీంకోర్టే దిక్కు: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు

ఇలాంటి ఘటనే చైనాలో మరోసారి వెలుగు చూసింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ చైనా రినయ్‌సెన్స్ చైర్మన్, సీఈఓ బావో ఫాన్ ఉన్నట్టుండి గల్లంతు అయ్యారు. బావో ఫాన్‌ కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయనను సంప్రదించడం కూడా సాధ్యం కావడం లేదని ‘ఈ బ్యాంక్’ ఓ ప్రకటనలో తెలిపింది. బావో ఫాన్ అందుబాటులో లేకపోవడానికి, తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధం ఉందో, లేదో తెలియదని ఈ ప్రకటన పేర్కొంది.

Taslima Nasreem: తాలిబన్ చేతుల్లోకి పాకిస్తాన్.. తస్లీమా నస్రీం సంచలన వ్యాఖ్యలు

ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 50 శాతం పతనమయ్యాయి. బావో ఫాన్ 1990వ దశకంలో ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూసీలలో ఆయన కెరీర్ సాగింది. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అడ్వయిజర్‌గా పని చేశారు. ఇద్దరితో కలిసి చైనా రినయ్‌సెన్స్‌ను 2005లో ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మెయిటువన్, డియన్‌పింగ్ 2015లో విలీనమవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ట్రెండింగ్ వార్తలు