Taslima Nasreem: తాలిబన్ చేతుల్లోకి పాకిస్తాన్.. తస్లీమా నస్రీం సంచలన వ్యాఖ్యలు
అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్‌ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Taslima Nasreem sensational comments in the hands of Taliban
Taslima Nasreem: కొద్ది కాలం క్రితం తాలిబన్లు అఫ్గానిస్ను స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 21వ శతాబ్దంలో ఉగ్రవాదులు ఇలా ఒక దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రపంచమంతా విస్తుపోయింది. కానీ, అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్‌ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !
తాజాగా కరాచీలో మానవ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, తెహ్రీక్-ఇ-తాలిబన్‌కి చెందిన ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనను ఉద్దేశించి తస్లీమా పై విధంగా వ్యాఖ్యానించారు. ఇదే విషయమై ఆమె ఇంకా స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా మార్చేందుకు ఐఎస్‌ఐఎస్ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు ఆ పని సమర్థంగా చేయగలరు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ను వారు స్వాధీనం చేసుకున్నా నేనైతో ఆశ్చర్యపోను’’ అని తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు