Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి.

Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు

Harish Rao: అరవై ఏళ్ల కాంగ్రెస్, తెలుగు దేశం పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారని ప్రశంసించారు మంత్రి హరీష్ రావు. శనివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Nadda on Religious Issues: బాంబ్ పేల్చిన బీజేపీ చీఫ్.. ఎంపీలు, నాయకులు మతపరమైన కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్

‘‘బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి. పెద్దపెద్ద పదవులు పొందారు కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ వాళ్లు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ నాయకులు అక్రమ గంజాయి సరఫరా చేస్తూ కోట్లు సంపాదించారు.

Nikki Yadav Murder: నిక్కీ యాదవ్ హత్య కేసులో ట్విస్ట్.. రెండేళ్లక్రితమే పెళ్లి చేసుకున్న జంట

మన దగ్గరకు కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు.కాంగ్రెస్ వాళ్లు బసవేశ్వరుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం బసవేశ్వరుని పేరుతో ప్రాజెక్టు కడుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. దేవుళ్ల పేరుతో కేసీఆర్ జిల్లాలు పెట్టారు. ప్రాజెక్టులకు కూడా దేవుళ్ల పేర్లు పెట్టారు. దేవుళ్లపై నిజమైన భక్తి కేసీఆర్‌కే ఉంది. యాదాద్రి గుడిని ఎన్నికలు వచ్చే వరకు మెల్లగా కట్టలేదు.

భక్తితో నిర్మించాడు. బొరంచ గ్రామంలో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం. బసవేశ్వర ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన అందరినీ అన్ని విధాలా ఆదుకుంటాం. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రైతు విలువను కేసీఆర్ పెంచిండు. దీంతో రైతు చేతిలో ఉన్న భూమి విలువ పెరిగింది’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.