TRAI New Spam Rules 2026 : ట్రాయ్ కొత్త రూల్స్.. స్పామ్ కాల్ చేస్తే ఖబడ్దార్.. ఫస్ట్ తప్పుకే 15 డేస్ బ్యాన్, రిపీట్ అయితే ఏడాది బ్లాక్!
TRAI New Spam Rules 2026 : స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏఐ, మిషన్ లెర్నింగ్ ద్వారా స్పామ్‌గా గుర్తిస్తే 15 రోజుల అవుట్‌గోయింగ్ బ్యాన్, రిపీట్ ఉల్లంఘనలకు ఏడాది వరకు నిషేధం విధించనుంది.
- Sreehari A
- Updated on- September 29, 2026 / 06:51 PM IST
TRAI Tightens Spam Rules
- స్పామ్ కాల్స్‌కు ట్రాయ్ చెక్
- ఏఐ ఫ్లాగ్ చేస్తే ఇక 15 రోజుల బ్యాన్
- 1909 నుంచి ట్రూకాలర్ వరకు కొత్త రూల్స్
TRAI New Spam Rules 2026 : స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్న మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. స్పామ్ కాల్స్ విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై అనవసరమైన కమర్షియల్ కాల్స్‌పై చర్యలు తీసుకునేందుకు కస్టమర్ ఫిర్యాదు కోసం టెలికాం కంపెనీలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.
ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ML) సిస్టమ్ ఒక నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ను అనుమానాస్పద స్పామ్‌గా గుర్తిస్తే.. దాని ఆధారంగా చర్యలు (TRAI New Spam Rules 2026) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ట్రాయ్ టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ (థర్డ్ అమెండమెంట్) రెగ్యులేషన్స్ 2026ను తీసుకొచ్చింది.
ఏఐ స్పామ్‌ను గుర్తిస్తే ఏమౌతుంది? :
కొత్త రూల్స్ ప్రకారం.. ఒక టెలికాం కంపెనీకి చెందిన ఏఐ లేదా మిషన్ లెర్నింగ్ సిస్టమ్ స్పామ్‌గా అనుమానించిన కాల్‌ను గుర్తిస్తే.. ఆ కాల్‌కు సంబంధించిన సమాచారాన్ని 2 గంటల్లోగా కాల్ ప్రారంభమైన నెట్‌వర్క్ ఆపరేటర్‌తో షేర్ చేయాలి. ఆ తర్వాత ఆర్జినేటింగ్ యాక్సెస్ ప్రొవైడర్ (OAP) సంబంధిత పంపినవారి కేవైసీ ఐడెంటిఫైయర్‌ను నిర్ధారించాలి.
అంతేకాదు.. గత 10 రోజుల్లో అదే పంపినవారికి సంబంధించిన ఇతర కనెక్షన్ల నుంచి అనుమానాస్పద కాల్స్ లేదా కమ్యూనికేషన్స్ జరిగాయా అనే విషయాన్ని కూడా టెలికాం కంపెనీలు పరిశీలించాలి. 5 లేదా అంతకంటే ఎక్కువ CLI నంబర్లు అనుమానాస్పదంగా తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి తప్పుకే 15 రోజుల బ్యాన్ :
స్పామ్ కాల్స్‌కు పాల్పడే వారిపై టెలికాం కంపెనీలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాచారం అందిన వెంటనే సంబంధిత నంబర్ల నుంచి అనుమానిత స్పామ్ కాల్స్ జరిగాయా అనేది నెట్‌వర్క్ స్థాయిలో పరిశీలిస్తాయి.
ఒకే వ్యక్తి లేదా సంస్థ కేవైసీకి అనుసంధానమైన 5 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు 10 రోజుల్లో స్పామ్‌గా తేలితే సమష్టిగా చర్యలు తీసుకుంటాయి. ఏఐ వ్యవస్థ తొలిసారి స్పామ్‌గా గుర్తిస్తే సంబంధిత అన్ని సిమ్ కార్డులు, కనెక్షన్లపై చర్యలు తీసుకుంటాయి.
Read Also : Nothing Phone 3 : భలే డిస్కౌంట్ బ్రో.. రూ. 80వేల నథింగ్ ఫోన్ 3 అమెజాన్‌లో జస్ట్ రూ. 51,999కే..
అవుట్‌గోయింగ్ సేవలను అన్ని నెట్‌వర్క్‌లలో 15 రోజుల పాటు నిలిపివేస్తాయి. స్పామ్ చేసిన నంబర్‌తో పాటు అదే వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఇతర కనెక్షన్లపైనా చర్యలు తప్పవు. తరచూ స్పామ్ కాల్స్‌కు పాల్పడితే మరింత కఠిన చర్యలు ఉంటాయి. సిమ్ కార్డులు, పీఆర్ఐలు, ఎస్ఐపీ ట్రంక్‌ల వంటి టెలికాం వనరులను ఏడాది వరకు నిలిపివేస్తారు. అదే సమయంలో సంబంధిత వ్యక్తి లేదా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి కొత్త కనెక్షన్లు ఇవ్వరు. తీవ్రమైన ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేసి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
ట్రూకాలర్ యాప్స్‌కు కూడా రూల్స్ :
ట్రూకాలర్ వంటి కాల్ మేనేజ్‌మెంట్ యాప్స్ విషయంలోనూ కొత్త రూల్స్ తప్పనిసరి. ట్రాయ్ నిర్దేశించే కొన్ని నంబర్ సిరీస్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను యాప్స్ ఆటోమేటిక్‌గా స్పామ్‌గా ట్యాగ్ చేయడం, బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయకూడదు. అయితే, యూజర్లు తమ డివైజ్‌లో కాల్స్‌ను అవసరమైనప్పుడు మాన్యువల్‌గా బ్లాక్ లేదా ఫిల్టర్ చేసుకోవచ్చు.
1909కు ‘బ్లాక్ ప్రోమో’ ఎస్ఎంఎస్ :
ప్రమోషనల్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ వద్దనుకునే కస్టమర్లు 1909కు ‘BLOCK PROMO’ అని SMS పంపవచ్చు. దీంతో ప్రమోషనల్ కమ్యూనికేషన్స్‌ను బ్లాక్ చేయవచ్చు. అయితే, ట్రాన్సాక్షన్, సర్వీస్, ప్రభుత్వ సంబంధిత కమ్యూనికేషన్స్‌కు ఇది వర్తించదు.
ట్రాయ్ కొత్త రూల్స్ దశలవారీగా అమల్లోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు తమ టెక్నికల్ సిస్టమ్స్ కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా అమలు 30 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి కొనసాగనుంది.
