TVS iQube electric scooter prices for Delhi revealed, here are details
TVS iQube EV Scooter : కొత్త ఈవీ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి టీవీఎస్ మోటార్ కంపెనీ ఈవీ కేటగిరీ నుంచి సరికొత్త TVS iQube EV స్కూటర్ వచ్చేస్తోంది. ఈ టీవీఎస్ ఢిల్లీ మోడల్ (TVS iQube) రేంజ్ కొత్త ధరలను కంపెనీ వెల్లడించింది. FAME-II సబ్సిడీని సవరించిన తర్వాత ఈ కొత్త ధరలను ప్రకటించింది. మే 20 వరకు బుకింగ్ చేసుకున్న వినియోగదారుల కోసం టీవీఎస్ (TVS iQube) ఢిల్లీలో ఆన్-రోడ్ ధర రూ. 1,16,184, TVS iQube S ధర రూ. 1,28,849 ఉంటుంది.
Read Also : BGMI Game Download : బీజీఎంఐ గేమ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? మీ కంప్యూటర్‌లో గేమ్ ఆడాలంటే?
మే 21 నుంచి చేసిన బుకింగ్‌ల కోసం ఢిల్లీలో ఆన్-రోడ్ ధర TVS iQube ధర రూ. 1,23,184, TVS iQube S ధర రూ. 1,38,289 నుంచి అందుబాటులో ఉంది. గత మేలో TVS iQube ఈవీ స్కూటర్ ధర 20వేల యూనిట్లకు పైగా రిటైల్ చేసింది. FY23లో, కంపెనీ లక్ష యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ దేశంలో ఈవీ నాయకత్వం వహిస్తోంది. ఈ విద్యుదీకరణ ప్రయాణం ద్వారా (TVS iQube) గత ఆర్థిక ఏడాదిలో స్కూటర్ల రేంజ్ లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని నమోదు చేసింది.
TTVS iQube EV Scooter prices for Delhi revealed, here are details
ఈ సందర్భంగా ‘హ్యాపీ కస్టమర్లు’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మను సక్సేనా అన్నారు. ఇప్పటికే దేశ మార్కెట్లో దూసుకుపోతున్న Ola S1, Ather 450X, బజాజ్ చేతక్ వంటి ఈవీ స్కూటర్లకు పోటీగా టీవీఎస్ మోటర్ నుంచి TVS iQube ఈవీ స్కూటర్ వస్తుంది.