ఏదన్నా అవసరం ఉంటే..ముందే డబ్బులు తెచ్చిపెట్టుకోండి. లేకుంటే..ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే..బ్యాంకులకు రెండు రోజుల పాటు తాళాలు పడనున్నాయి. ATM సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నాయి. వేతన సవరణ చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు సక్సెస్ కాలేదు.
దీంతో జనవరి 31, ఫిబ్రవరి 01వ తేదీన రెండు రోజుల పాటు సమ్మెలోకి వెళుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. డిమాండ్ల సాధన కోసం మరోసారి మార్చి 11 నుంచి మార్చి 13వ తేదీ వరకు సమ్మె చేపడుతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (UFBU) ప్రకటించింది. UFBU 15 శాతం వేతనాలు పెంచాలని కోరుతోంది. అయితే..IBA మాత్రం 12.25 శాతం వరకు పెంచుతామని అంటోంది. దీనిని యూనియన్లు తిరస్కరిస్తున్నాయి. దీంతో సమ్మె అనివార్యమైందని వెల్లడిస్తున్నారు. నెలాఖరులో బ్యాంకులు ఉద్యోగులు సమ్మెలోకి వెళుతుండడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రెండు రోజుల పాటు సమ్మె చేసినా..స్పందన రాకపోతే..మార్చి 11వ తేదీ నుంచి మార్చి 13 వరకు సమ్మె చేపడుతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (UFBU) వెల్లడిస్తోంది. అప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే..ఏప్రిల్ 01వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతామని UFBU వెల్లడించింది.
Read More : GSAT 30 ప్రయోగానికి ISRO రెడీ