Ultraviolette F77 : పెట్రోల్ బిల్లుకు గుడ్‌బై! అల్ట్రావయోలెట్ EV బైకులపై రూ. 30వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్..!
Ultraviolette F77 : కిలో ది పెట్రోల్ బిల్ క్యాంపెయిన్ లో భాగంగా కొత్త ఎలక్ట్రిక్ బైకు కొనుగోళ్లపై రూ. 30వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ రెండు బైకుల ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్
- Sreehari A
- Published on- June 9, 2026 / 05:33 PM IST
Ultraviolette F77
- అల్ట్రావైలెట్ ‘కిల్ ది పెట్రోల్ బిల్’ క్యాపెంయిన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
- అల్ట్రావయోలెట్ X-47 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.49 లక్షలు
- అల్ట్రావయోలెట్ F77 సిరీస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.09 లక్షలు
Ultraviolette F77 : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. పెట్రోల్ బైకులతో విసిగిపోయి కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ (UV) ‘కిల్ ది పెట్రోల్ బిల్’ అనే కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే..
పెట్రోల్ టూ-వీలర్ నుంచి ఎలక్ట్రిక్ బైకుకు మారే కస్టమర్లకు ఈ క్యాంపెయిన్ కింద రూ. 30,000 వరకు (Ultraviolette F77) క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అల్ట్రావయోలెట్ ప్రస్తుతం F77 సిరీస్, X-47 అనే రెండు బైకు మోడళ్లను ఆఫర్ చేస్తోంది. ‘కిల్ ది పెట్రోల్ బిల్’ ప్రోగ్రామ్ ఈ రెండింటికీ వర్తిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఎలా పొందాలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
అల్ట్రావయోలెట్ F77 సిరీస్, అల్ట్రావయోలెట్ X-47 ధరలివే :
అల్ట్రావయోలెట్ F77 సిరీస్ ధర రూ. 3.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కాగా, అల్ట్రావయోలెట్ X-47 ధర రూ. 2.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ వివరాలు తప్పనిసరి :
అల్ట్రావయోలెట్ ‘కిల్ ది పెట్రోల్ బిల్’ ప్రోగ్రామ్ అనేది కొనుగోలుదారుడి గత పెట్రోల్ టూ వీలర్ ప్రయాణించిన దూరాన్ని బట్టి డిస్కౌంట్ అందిస్తుంది. ఇందుకోసం కస్టమర్లు రెండు ముఖ్యమైన వివరాలను అందించాలి. అందులో ఒకటి గత పెట్రోల్ టూవీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), కొనుగోలు సమయంలో ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉందో చూపించాలి.
Read Also : Vivo X300 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్మురేపుతున్న వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్..! ధర చూస్తే నోరెళ్లబెడతారు!
క్యాష్‌బ్యాక్ లెక్కింపు ఇలా :
అల్ట్రావయోలెట్, ఓడోమీటర్ రీడింగ్‌తో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌ను లెక్కిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ బైకు వయస్సు ఆధారంగా కంపెనీ ముందుగా ఏడాదిలో ప్రయాణించిన సగటు దూరాన్ని లెక్కిస్తుంది. ఆ తర్వాత మొత్తం క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ కోసం ఈ సంఖ్యను రెండుతో గుణించాలి. సింపుల్‌గా చెప్పాలంటే గత రెండు ఏళ్లలో ప్రయాణించిన దూరానికి సమానమైన క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది.
మీ పెట్రోల్ బైకు ఓడోమీటర్ 60,000 కి.మీ నడిచిందా? 5 ఏళ్లుగా వాడుతున్నారా? వార్షిక వినియోగం సుమారుగా 60,000/5 అంటే.. 12,000 కి.మీ అవుతుంది. ఇప్పుడు మీరు రూ. 24,000 (2×12,000) అంటే రూ. 30,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
గతంలో ఒకటి కన్నా ఎక్కువ బైకులను వాడితే మీరు రూ. 30వేల వరకు సంపాదించవచ్చు. ఈ క్యాంపెయిన్ అన్ని టూ-వీలర్ మోడల్స్, బ్రాండ్‌లకు వర్తిస్తుంది. అయితే, మీ వద్ద వాహనం ఆర్‌సీతో పాటు క్లియర్ ఓడోమీటర్ రీడింగ్ తప్పనిసరిగా ఉండాలి. క్యాష్‌బ్యాక్ అందించే ముందు అల్ట్రావైలెట్ టీమ్ ఇవన్నీ వెరిఫై చేస్తారు.
