Union Budget 2026
Union Budget 2026 : వచ్చే బడ్జెట్‌పైనే అందరి ఆశలు.. కేంద్ర బడ్జెట్ సమయం దగ్గర పడే కొద్ది మధ్యతరగతి నుంచి ప్రతిఒక్కరిలో టెన్షన్ మొదలైంది.. ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయి? ఎవరికి ఏ వర్గానికి మినహాయింపులు, ఉపశమనాలు ఉంటాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా లక్షలాది మంది గృహ రుణదాతలు, మధ్యతరగతివారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి గృహ రుణాలు, పన్ను మినహాయింపుల చుట్టూ భారీ సస్పెన్స్ కొనసాగుతోంది. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరుగుతున్న గృహ ధరలు, వడ్డీ రేట్ల మధ్య ఈ బడ్జెట్‌లో ఈఎంఐల భారాన్ని తగ్గించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం సామాన్యులు సైతం ఎదురుచూస్తున్నారు.
1. వడ్డీ రాయితీ పరిమితి.. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు :
ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(b) కింద గృహ రుణ వడ్డీకి గరిష్ట మినహాయింపు రూ.2 లక్షలుగా ఉంది. 2014-15 నుంచి ఈ పరిమితి మారలేదు. గత 10 ఏళ్లలో ఇంటి ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ పరిమితిని కనీసం రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ ఉందని ఆర్థిక నిపుణులు, సీఆర్ఈడీఏఐ వంటి సంస్థలు చెబుతున్నాయి.
Read Also : Budget Economic Survey 2026 : కేంద్ర ఆర్థిక సర్వే 2026.. ఇకపై ఆ సమయంలో కొన్ని రకాల ప్రకటనలు బ్యాన్..
2. ఈఎంఐ తగ్గుతుందా? పెరుగుతుందా? :
బడ్జెట్ నేరుగా బ్యాంకు వడ్డీ రేట్లను నిర్ణయించదు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేయాల్సిన పని. కానీ, బడ్జెట్ విధానాలతో ఈఎంఐ ఎంత అనేది నిర్ణయించే వీలుంది.
సరసమైన గృహాలు : ప్రభుత్వం సరసమైన గృహాల విషయంలో (ప్రస్తుతం రూ. 45 లక్షలు) నుంచి రూ. 65-75 లక్షలకు మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మరింత మంది సబ్సిడీ, చౌక రుణాల పరిధిలోకి వస్తారు.
పన్ను ఆదా : పన్ను మినహాయింపు పరిమితి పెరిగితే మీ పన్ను ఆదా పెరుగుతుంది. తద్వారా ఈఎంఐల భారం కూడా తగ్గుతుంది.
3. సెక్షన్ 80C, అసలు తిరిగి చెల్లింపు :
గృహ రుణ అసలు మొత్తం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఇందులో సమస్య ఏమిటంటే.. రూ. 1.5 లక్షలలో PPF, LIC, పిల్లల ఫీజులు కూడా ఉన్నాయి. ఇళ్లు కొనుగోలుదారులు భారీగా రిలీఫ్ పొందాలంటే గృహ రుణంలో అసలు మొత్తం తిరిగి చెల్లించడంపై ప్రత్యేకంగా మినహాయింపు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
4. కొత్త పన్ను విధానంపై సస్పెన్స్ :
ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో గృహ రుణ వడ్డీపై ఎలాంటి మినహాయింపు లేదు. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం గృహ రుణాలు, ఇన్సూరెన్స్‌పై కూడా మినహాయింపులను అందిస్తుందని మధ్యతరగతి ఆశగా ఎదురుచూస్తోంది.