×
Ad

Union Budget 2026 : టాక్స్ పేయర్లలో టెన్షన్ టెన్షన్.. 2026 బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్ష చేస్తారా? ఇదేజరిగితే ఉద్యోగులకు పండగే..!

Union Budget 2026 : పన్ను చెల్లింపుదారుల్లో ఒకటే టెన్షన్.. ఈసారి బడ్జెట్ 2026లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచుతారా? లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిమితిని రూ. 75,000 నుంచి రూ.100,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Nirmala Sitharaman Standard Deduction (Image Credit To Original Source)

  • 2026లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచుతారా?
  • రూ. 75,000 నుంచి రూ.100,000కి పెంచాలని డిమాండ్
  • పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల్లో భారీగా ఆశలు
  • రూ. 13 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను లేదు?

Union Budget 2026 : టాక్స్ పేయర్లలో టెన్షన్ టెన్షన్.. 2026 బడ్జెట్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించేందుకు ఇంకా రెండు వారాల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇందులో విశేషమేమిటంటే.. ఈసారి బడ్జెట్ ఫిబ్రవరి 1 (ఆదివారం) ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోవడం ఇదే మొదటిసారి కానుంది.

అయితే, ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్నులో ఉపశమనాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ 2025లో సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు, జీతం పొందే వ్యక్తులకు అనేక వరాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను రేటు కోతల నుంచి కొత్త పన్ను స్లాబ్‌ల వరకు బడ్జెట్ 2025 మధ్యతరగతి వారి అనేక డిమాండ్లను పరిష్కరించింది.

బడ్జెట్ 2026లో టాక్స్ పేయర్ల అంచనాలు? :
ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పైనే పన్ను చెల్లింపుదారుల దృష్టి పడింది. అయితే ఇందులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల నుంచి రూ. లక్షకు పెంచవచ్చు. దీనిపై పన్నుచెల్లింపుదారులు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. దేశ ఆర్థిక మంత్రి గత ఏడాదిలో ఎలాంటి ప్రకటనలు చేశారో ఈసారి కూడా అదే స్థాయిలో ప్రకటించే అవకాశం ఉందని అని భావిస్తున్నారు.

ఆదాయపు పన్ను రేటు తగ్గింపు :
గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించడంతో మధ్యతరగతికి భారీగా ఉపశమనం లభించింది. అలాగే, జీతం పొందే వ్యక్తులకు రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ చేర్చిన తర్వాత లిమిట్ రూ. 12.75 లక్షలకు పెరిగింది. దాంతో రూ. 12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది.

కొత్త పన్ను శ్లాబులు :
బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద సీతారామన్ కొత్త స్లాబ్ రేట్లను కూడా ప్రకటించారు. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఆదాయపు పన్ను స్లాబ్   ఆదాయపు పన్ను రేటు

  • రూ. 0 నుంచి రూ. 4 లక్షలు  : టాక్స్ లేదు
  • రూ. 4 లక్షలు నుంచి రూ. 8 లక్షలు :  5 శాతం
  • రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు : 10 శాతం
  • రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలు : 15 శాతం
  • రూ.16 లక్షల నుంచి రూ. 20 లక్షలు : 20 శాతం
  • రూ.20 లక్షల నుంచి రూ. 24 లక్షలు : 25 శాతం
  • రూ.24 లక్షలు అంతకన్నా ఎక్కువ  : 30 శాతం

Read Also : Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన స్కీమ్.. నెలకు కేవలం రూ. 210 డిపాజిట్ చేస్తే.. రూ.5,000 పెన్షన్.. ఎలా అప్లయ్ చేయాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

కొత్త ఆదాయపు పన్ను బిల్లు :
ఆర్థిక మంత్రి కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను కూడా ప్రకటించారు. ఆ తర్వాత లోక్‌సభలో ఆమోదించారు. 2026 ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది.

అద్దెదారులకు ఊరట :
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా టీడీఎస్ రేటులో కూడా అనేక మార్పులు చేశారు. అద్దెపై టీడీఎస్ పరిమితిని రూ. 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. చిన్న ఇంటి యజమానులకు మరింత ఊరట లభించింది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ. 50వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు.

ఐటీఆర్ (U)లో రిలీఫ్ :
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను అప్‌డేట్ చేసేందుకు ఎక్కువ సమయం ఉండేలా ఐటీఆర్(U)ను రెండు ఏళ్లకు బదులుగా 4 ఏళ్ల పాటు దాఖలు చేయవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

స్టాండర్డ్ డిడక్షన్‌లో మార్పు :
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌లో భారీగా మార్పులు చేసి సాధారణ ప్రజలకు భారీ ఉపశమనం అందించాలని చూస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 75వేలుగా ఉంది.

రూ.12.75 లక్షల వార్షిక ఆదాయం పన్ను ఉండదు. అదే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. లక్ష అయితే రూ. 13 లక్షల వార్షిక ఆదాయం సాధారణ ప్రజలకు పన్ను రహితంగా మారుతుంది. దాంతో సాధారణ ప్రజలకు భారీగా ఉపశమనం లభిస్తుంది అనమాట.