Telugu » Business » Upcoming Car Launches In October Bolero Facelift New Thar Octavia Rs And More Check Full Details Sh
Upcoming Cars October : కొత్త కారు కొంటున్నారా? అక్టోబర్‌లో రాబోయే సరికొత్త కార్లు ఇవే.. ఫీచర్లు అదుర్స్.. ఇలాంటి కారు ఒక్కటైనా ఇంట్లో ఉండాల్సిందే..!
Upcoming Cars October : అక్టోబర్ 2025లో కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్, బొలెరో నియో, కొత్త థార్, స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ నిస్సాన్ రాబోయే సి-సెగ్మెంట్ SUV ఉన్నాయి.
Upcoming Cars October : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత ఆటో మొబైల్ మార్కెట్లో వచ్చే అక్టోబర్ కొత్త కార్లతో సందడిగా మారనుంది. ఎస్‌యూవీ, పెర్ఫార్మెన్స్, సెడాన్లు, యుటిలిటీ వెహికల్స్ అందించే అనేక రిఫ్రెష్ కొత్త మోడళ్లు లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. బొలెరో ఫేస్‌లిఫ్ట్, అప్‌డేట్ థార్, కొత్త బొలెరో నియో మోడల్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆసక్తికరమైన మోడళ్లతో పాటు, స్పోర్టీ స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ రిటర్న్స్ కూడా భారత మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి. ఈ రాబోయే కార్లకు సంబంధించి పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
2/5
బొలెరో ఫేస్‌లిఫ్ట్ : మహీంద్రా ఫేస్‌లిఫ్టెడ్ బొలెరో రాబోతుంది. కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో భారీ మెరుగైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది. ఫ్రంట్ సైడ్ అప్‌డేట్ ఫీచర్లు ఉండొచ్చనని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, చాలా మెకానికల్స్ కూడా మారవచ్చు. ఈ అప్‌డేట్ బొలెరో పెయిర్ స్టైలిష్ ఫాగ్ ల్యాంప్‌ల మధ్య కొత్త 4-స్లాటెడ్-డిజైన్ గ్రిల్ కలిగి ఉంటుంది. క్యాబిన్‌లో కొత్తగా స్టీరింగ్ వీల్‌తో కలిపి అడ్జెస్టెడ్ అప్హోల్స్టరీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీడియా కంట్రోల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
3/5
కొత్త థార్ 3-డోర్ వెర్షన్ : వచ్చే అక్టోబర్‌లో రాబోయే కార్లలో మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ (3-డోర్ల వెర్షన్) కారు ఒకటి. ఇటీవలి స్పై షాట్‌లు డబుల్ స్టాకింగ్ స్లాట్‌లు, సి-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్ కొత్త అల్లాయ్ వీల్స్‌తో కూడిన కొత్త గ్రిల్‌తో వస్తుంది. ఇంటీరియర్ పరంగా పెద్ద 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కలిగి ఉంది. గతంలో మాదిరిగా హైడ్రాలిక్ త్రి-స్పోక్ పవర్ స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జర్ రూపంలో రావచ్చు. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు మాన్యువల్‌లు, ఆటోమేటిక్‌లతో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో రావొచ్చు.
4/5
బొలెరో నియో : బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్ కూడా కొత్త బొలెరోతో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త హారిజాంటల్-స్లాటెడ్ గ్రిల్, లోయర్ బంపర్, అప్‌డేటెడ్ LED లైటింగ్‌తో రీడిజైన్ ఫ్రంట్ ఎండ్ ఉంటుందని భావిస్తున్నారు. రూఫ్ స్పాయిలర్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, టెయిల్‌ల్యాంప్‌లు వంటి ఇతర ఎక్స్‌టీరియర్ ఫీచర్లు అలాగే ఉండొచ్చు. ఈ లిస్టులో ఇతర మహీంద్రా మోడళ్ల మాదిరిగానే బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్ కూడా అదే మెకానికల్ సెటప్‌తో కొనసాగే అవకాశం ఉంది.
5/5
స్కోడా ఆక్టేవియా RS రిటర్న్స్ : వచ్చే నెలలో భారత మార్కెట్లోకి ఆక్టేవియా RS రిటర్న్స్ వస్తోంది. ఈ RS వేరియంట్ స్టాండర్డ్ ఆక్టేవియా కన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్, స్టైలింగ్ అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం ఉంది. ఈ ప్రీమియం స్కోడా సెడాన్‌లో 100 యూనిట్లను మాత్రమే ఫుల్లీ-బిల్ట్ యూనిట్లు (FBU)గా తీసుకువస్తోంది. అక్టోబర్ 6న బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. అయితేచ అక్టోబర్ 17న ధర ప్రకటించనున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.