విక్టోరియా సీక్రెట్ స్టోర్లను శాశ్వతంగా మూసేస్తోంది!

  • Publish Date - May 22, 2020 / 09:01 AM IST

ప్రముఖ అమెరికన్ డిజైనర్ సంస్థ విక్టోరియా సీక్రెట్ నాలుగింట ఒక వంతు సొంత స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో యూనైటెడ్ స్టేట్స్, కెనడాలో విక్టోరియా సీక్రెట్ తమ రిటైల్ స్టోర్లను మూసివేయనుంది. కొవిడ్-19 సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైలర్ స్టోర్.. హాఫ్ బిలియన్ డాలర్ల ప్రణాళికను రద్దు చేసిన కొద్ది వారాల తరువాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. L Brands (LB) సొంత కంపెనీ అయిన విక్టోరియా సీక్రెట్ కు సంబంధించి 250 స్టోర్ల మూసివేత ప్రారంభం కానుంది. వచ్చే కొన్ని ఏళ్లలో మరిన్ని స్టోర్లు మూసివేయనున్నట్టు హెచ్చరించింది. ఉత్తర అమెరికాలో దాదాపు 1,100 విక్టోరియా సీక్రెట్ లొకేషన్లు ఉన్నాయి. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ Stuart Burgdoerfer మాట్లాడుతూ… కంపెనీని బలోపేతం చేయడంలో చాలా ముఖ్యమైన నిర్ణయమని అన్నారు. 

ప్రైవేటు ఈక్విటీ సంస్థ Sycamore Partnersతో గతంలో రిటైలర్ ప్రైవేటు కోసం L Brands ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ, మే నెలలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. కరోనా సంక్షోభంతో తాత్కాలిక స్టోర్లను మూసివేసిన సమయంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. L Brands సంస్థ మరిన్ని 50 బాత్, బాడీ వర్క్ స్టోర్లను కూడా మూసివేయనుంది. ఉత్తర అమెరికాలో బ్రాండ్ స్టోర్లు 1700 వరకు ఉన్నాయి. స్టోర్లను మూసివేస్తున్నప్పటికీ బాత్ అండ్ బాడీ వర్క్స్ నాలుగింట ఒక వంతు పటిష్టంగానే కనిపిస్తోంది. 

గత ఏడాదిలో దీని ఆన్ లైన్ సేల్స్ 85 శాతం మేర పెరగగా, 100 మిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాదిలో శానిటైజర్ ప్రొడక్టుల విక్రయాలతో 300 మిలియన్ డాలర్ల వ్యాపారం భారీగా పెరిగిపోయింది. కానీ, L బ్రాండ్స్ తొలి త్రైమాసికంలో సేల్స్ 37శాతం మేర క్షీణించాయి. కరోనా మహమ్మారి సమయంలో మార్చి మధ్యనుంచి రెండు బ్రాండ్ల మధ్య అత్యధికంగా ఫిజిల్ స్టోర్లు మూతపడ్డాయి. ఎల్ బ్రాండ్స్ షేర్లు కూడా గురువారం ట్రేడింగ్‌లో 18 శాతం మేర ఎగిశాయి.