Vijaya Diagnostic Centre: ఐపీఓకు రూ.1895కోట్లతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్

హైదరాబాద్ కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ రూ.1895కోట్లతో సెప్టెంబర్ 1 నుంచి ఐపీఓకు రానుంది. అది కూడా రూ.1ఫేస్ వాల్యూతో రూ.522-531మధ్య ప్రైస్ బ్యాండ్ ఉంటుంది.

Vijaya Diagnostic Centre Ipo

Vijaya Diagnostic Centre: హైదరాబాద్ కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ రూ.1895కోట్లతో సెప్టెంబర్ 1 నుంచి ఐపీఓకు రానుంది. అది కూడా రూ.1ఫేస్ వాల్యూతో రూ.522-531మధ్య ప్రైస్ బ్యాండ్ ఉంటుంది.

సదరన్ ఇండియాలో ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ చైన్ ఆపరేట్ చేస్తున్న విజయా.. ఫిక్స్‌డ్ ప్రైస్ బ్యాండ్ ఈక్విటీ షేర్ రూ.522 నుంచి రూ.531వరకూ చేరనుంది. కనీసం 28ఈక్విటీ షేర్ల నుంచి మల్టీపుల్ క్వాంటిటీలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా 2021 సెప్టెంబర్ 3తో క్లోజ్ అవుతుంది.

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ సేల్ ఆఫర్లో భాగంగా 3కోట్ల 56లక్షల 88వేల 64 షేర్లను అమ్మకానికి ఉంచింది. వీటిల్లో 50లక్షల 98వేల 296షేర్లు డా. ఎస్ సురేంద్రనాథ్ రెడ్డి, 2కోట్ల 94లక్షల 87వేల 290 కరకోరమ్ పేరిట ఉండగా 11లక్షల 2వేల 478ఈక్విటీ షేర్లు మాత్రం కేదారా క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేతిలో ఉన్నాయి.

యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్ లో మూడో వంతు షేర్లను డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కోసం రిజర్వ్ చేసి ఉంచారు.
ఈక్విటీ షేర్స్ లో లిస్టింగ్ చేయడం ద్వారా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, షేర్ హోల్డర్లకు లిక్విడిటీ దొరుకుతుందని భావిస్తున్నారు.