Vivo V50 5G Price Drop
Vivo V50 5G Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. స్లిమ్ బాడీ, బిగ్ అమోల్డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 Gen3 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.
ఈ వివో V50 5G ఫోన్ భారీ 6000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరాలు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్‌లో ఈ హై-ఎండ్ మిడ్-రేంజర్ ఫోన్ రూ.6,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ వివో 5జీ ఫోన్ అప్‌గ్రేడ్ కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. వివో ఫీచర్లు, ఆఫర్‌లను ఓసారి పరిశీలిద్దాం..
వివో V50 5G ప్రాసెసర్ :
వివో V50 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ టాస్కులను సులభంగా పూర్తి చేయొచ్చు. 2.63GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్ అన్ని యాప్‌లలో సపోర్టు చేస్తుంది. 8GB ర్యామ్, మరో 8GB వర్చువల్ ర్యామ్ ఎక్స్‌టెన్షన్ అందిస్తుంది. అయితే, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ పెంచడం కుదరదు. స్టోరేజీ ఎక్స్ టెన్షన్ సపోర్టు అందించదు. వివో యూజర్లు క్లౌడ్ స్టోరేజ్‌పై ఆధారపడాలి. లేదంటే ఉన్న స్టోరేజీనే వినియోగించుకోవాలి.
వివో V50 5G డిస్‌ప్లే, బ్యాటరీ :
120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. స్క్రీన్ HDR10+, P3 వైడ్ కలర్ గమట్, 4500 నిట్స్ ఆకర్షణీయమైన ఫీచర్లను ఉంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ మన్నికను అందిస్తుంది.
ఈ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువసేపు వినియోగించవచ్చు. 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్టు కూడా ఉంది. రివర్స్ ఛార్జింగ్ ఇతర ఫోన్లకు పవర్ బ్యాంక్‌గా పనిచేస్తుంది.
వివో V50 5G కెమెరాలు :
వివో V50 5G ఫోన్ OISతో కూడిన బ్యాక్ డ్యూయల్ 50MP కెమెరా సెటప్ కలిగి ఉంది. డే టైమ్ లేదా తక్కువ కాంతిలోనూ అద్భుతమైన షాట్స్ తీయొచ్చు. ఫ్రంట్ 50MP కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ క్వాలిటీతో రికార్డు చేయొచ్చు. వీడియో రికార్డింగ్ 30fps వద్ద 4K UHDలో సపోర్టు ఇస్తుంది. తద్వారా కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్‌లకు క్వాలిటీ వీడియోలను రికార్డు చేసేందుకు వీలుంటుంది.
వివో V50 5G ధర :
వివో V50 5G ఫోన్ ధర రూ. 42,999కు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు ఈ వివో 5G ఫోన్ రూ. 36,999 ధరకు లభిస్తుంది. అంటే.. రూ.6వేలు స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరిన్ని డిస్కౌంట్లతో ఈ వివో 5జీ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు :
ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అనేక బ్యాంక్ డీల్స్ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అన్‌లిమిటెడ్ 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అన్ని క్రెడిట్ కార్డులపై ఈఎంఐ రహిత లావాదేవీలపై రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు.
అన్ని క్రెడిట్ కార్డులపై ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేల డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.26,150 వరకు తగ్గింపు పొందవచ్చు. కొన్ని మోడళ్లపై అదనంగా రూ. 3వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
కొంటారా? ఇంకా వేచి ఉంటారా? :
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో వివో V50 5G ఫోన్ రూ. 6వేల తగ్గింపుతో లభ్యమవుతుంది. పవర్‌ఫుల్ చిప్‌సెట్, హై-క్వాలిటీ అమోల్డ్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఆప్షన్లను కలిగి ఉంది. మీరు అద్భుతమైన 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. తక్కువ ధరలో వివో V50 5జీ ఫోన్ సొంతం చేసుకోండి.