Vivo X90, Vivo X90 Pro Confirmed to Go on Sale in India via Flipkart, Vivo X90+ Tipped to Launch Soon
Vivo X90 Sale in India : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రానుంది. వివో X90, వివో X90 ప్రో సిరీస్ పేరుతో రెండు మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. Vivo X90, Vivo X90 సిరీస్, Vivo X90, Vivo X90 Proతో ఏప్రిల్ 26న భారత మార్కెట్లోకి రానున్నాయి.
అధికారిక లాంచ్‌కు ముందే ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) ద్వారా సేల్ కంపెనీ ధృవీకరించింది. Vivo X90 సిరీస్ మైక్రోసైట్ ఇప్పటికే ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంటుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ఫోన్‌లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌కి కొత్త మోడల్ యాడ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. Vivo X90+ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతుందని అంచనా.
Vivo X90, Vivo X90 Pro ల్యాండింగ్ పేజీలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందించనుంది. ఈ వివో X90 సిరీస్ ఎప్పటినుంచి అందుబాటులో ఉండనుందో వెల్లడించనుంది. ఈ ఫోన్ బ్లాక్ కలర్‌లో లెదర్ బ్యాక్ ఫినిషింగ్‌తో పాటు 3 లెన్స్‌లు, LED ఫ్లాష్, ZEISS బ్రాండింగ్, T* కోటింగ్‌ను కలిగిన పెద్ద సర్కిల్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది. ఈ ఫోన్ కెమెరా ZEISS లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ వివరాలు కాకుండా, రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
Vivo X90, Vivo X90 Pro Confirmed to Go on Sale in India via Flipkart
Read Also : KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!
అయితే, (Vivo X90), (Vivo X90 Pro) ఇప్పటికే చైనాతో పాటు ప్రపంచ మార్కెట్‌లలో (Vivo X90 Pro+)తో పాటు లాంచ్ అయ్యాయి. అందువల్ల, ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. Vivo X90, Vivo X90 Pro చైనీస్, ఇతర గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే భారత్‌లోనూ ఇలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. Vivo X90+ ఫోన్ పూర్తిగా కొత్త మోడల్ అని చెప్పవచ్చు.
ప్రైస్‌బాబా (Pricebaba) రిపోర్టు ప్రకారం.. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ద్వారా.. (Vivo X90+) చైనీస్ మార్కెట్‌లో మోడల్ నంబర్ (V2141HA)ని అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో వస్తుందని చెప్పవచ్చు. డైమెన్సిటీ 9000-సిరీస్ చిప్‌సెట్, 12GB RAMతో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 80W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. టిప్‌స్టర్ చైనీస్ మార్కెట్లో Vivo X90+ లాంచ్ టైమ్‌లైన్‌ను కూడా లీక్ చేసింది. జూన్ లేదా జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.