×
Ad

VLF Tennis e-Scooter : కుర్రకారు మెచ్చిన VLF ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 150కిమీ రేంజ్..!

VLF Tennis e-Scooter : VLF టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర 1.29 లక్షల నుంచి ధర తగ్గింపు తర్వాత రూ. 99,999కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో రూ.30వేలు తగ్గింపుతో చౌకగా లభిస్తోంది.

VLF Tennis e-Scooter (Image Credit To Original Source)

  • భారత మార్కెట్లో వీఎల్ఎఫ్ టెన్నిస్ రూ. 30వేలు తగ్గింపు
  • VLF టెన్నిస్ స్కూటర్ ధర రూ.లక్ష లోపే
  • ఓలా S1 X, చేతక్ 3001, టీవీఎస్ ఆర్బిటర్, హీరో విడా VX2తో గట్టి పోటీ
  • ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్

VLF Tennis e-Scooter : భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రత్యేకించి చాలామంది ఫ్యామిలీ కస్టమర్లు, యవత ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఇటాలియన్ బ్రాండ్ వెలోసిఫెరో(VLF) అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. అదే.. వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టయిలిష్ డిజైన్‌తో మార్కెట్లో దూసుకెళ్తోంది.

ధర లక్ష లోపు మాత్రమే :
ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.30వేల తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ స్టైలిష్ స్కూటర్ జస్ట్ రూ. లక్ష లోపే రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ఇంటికి తెచ్చకోవచ్చు. మిడిల్ క్లాసు వినియోగదారుల కోసం కంపెనీ ఈ టెన్నిస్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. 2025 భారత మార్కెట్లోకి వచ్చిన ఇ-స్కూటర్ సరసమైన ధరలో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

VLF Tennis e-Scooter (Image Credit To Original Source)

ఫుల్ ఛార్జ్ చేస్తే 150కి.మీ రేంజ్ :

వీఎల్ఎఫ్ టెన్నిస్ స్కూటర్ 1500W హబ్ మోటార్‌తో వస్తుంది. గరిష్టంగా 157Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. నగర ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. 2.6 kWh కెపాసిటీతో రిమూవబుల్ LMFP బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ అంటోంది. కేవలం 3 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

మహిళలు, విద్యార్థులకు బెస్ట్ స్కూటర్ :
అలాగే, ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోగ్రాములే. హై-టెన్సైల్ స్టీల్ ఫ్రేమ్‌తో వస్తుంది. పెట్రోల్ స్కూటర్ల కన్నా చాలా తక్కువ బరువు ఉంటుంది. మహిళలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ ప్రోగ్రెసివ్ కాంటిలివర్ సస్పెన్షన్ హైడ్రాలిక్ మోనోషాక్ అందించారు.

Read Also : Republic Day 2026 Sale : ఐఫోన్ 17, ఐఫోన్ 16, శాంసంగ్ S24 అల్ట్రా, S25 అల్ట్రాపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏ ఫోన్ ధర ఎంతంటే?

బ్రేకింగ్ కోసం ఫ్రంట్, బ్యాక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్లు అమర్చారు. 12 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. 5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే కూడా ఉంది. ఎకో, కంఫర్ట్ , స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్లు ఉన్నాయి. హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్ అన్నీ ఎల్ఈడీ యూనిట్లనే అందిస్తోంది.

ప్రస్తుతం దేశీయంగా 15 నగరాల్లో డీలర్లు ఉన్నారు. ఆర్థిక ఏడాది ముగిసేనాటికి 50కి పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పుడు ధర రూ.లక్ష కన్నా తక్కువగా ఉండటంతో VLF టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 X, బజాజ్ చేతక్ 3001, TVS ఆర్బిటర్, హీరో విడా VX2 వంటి స్కూటర్లతో పోటీ పడుతోంది.