Volvo C40 Recharge SUV unveiled, launch in India in August
Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) రెండో ఎలక్ట్రిక్ మోడల్, (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధరల ప్రకటనతో ఆగస్టులో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. వోల్వో XC40 రీఛార్జ్ మోడల్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రిక్ (EV) వాహనం.
అంటే.. ఎలక్ట్రిక్ కారుగా గ్రౌండ్-అప్‌గా డెవలప్ చేసింది. మరోవైపు, వోల్వో XC40 రీఛార్జ్ ఇంటర్నల్ కర్బన్ ఇంజిన్ (ICE) ప్రతిరూపాన్ని కలిగి ఉంది. కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఇండియా-స్పెక్ వోల్వో C40 రీఛార్జ్ మోడల్ 408hp, 660Nm మిశ్రమ అవుట్‌పుట్‌తో ట్విన్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది.
78kWh బ్యాటరీ ద్వారా పవర్ అందిస్తుంది. వోల్వో C40 రీఛార్జ్ పరిధి 530km (WLTP)గా ఉంది. 4.7 సెకన్లలో 0-100 కి.మీల వేగాన్ని అందుకోగలదు. కొత్త ఎలక్ట్రిక్ SUVలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) స్టాండర్డ్‌గా ఉంది. ధరలను ప్రకటించిన తర్వాత కొనుగోలుదారులు నేరుగా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా (Volvo C40) రీఛార్జ్‌ను బుక్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ SUV డెలివరీలు మాత్రమే డీలర్‌షిప్‌ల ద్వారా జరుగుతాయి. వోల్వో 2030 నాటికి పోర్ట్‌ఫోలియోలో 100 శాతం ఎలక్ట్రిఫైడ్ వాహనాలను కలిగి ఉండాలని, 2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలని యోచిస్తోంది.
Volvo C40 Recharge SUV unveiled, launch in India in August
వోల్వో C40 రీఛార్జ్ భారత మార్కెట్‌పై వోల్వో కార్ ఇండియా నిబద్ధతకు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. వోల్వో XC40 రీఛార్జ్ మోడల్ ద్వారా, C40 రీఛార్జ్ లగ్జరీ మార్కెట్ వాటాను విస్తరించనుందని మేనేజింగ్ డైరెక్టర్, వోల్వో కార్ ఇండియా జ్యోతి మల్హోత్రా అన్నారు. ఈ కారు వినూత్న డిజైన్, అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీ, పర్యావరణం పట్ల అంకితభావాన్ని తెలియజేస్తుందని తెలిపారు. స్థిరమైన లగ్జరీతో వంద శాతం లెదర్-ఫ్రీ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌ను అందిస్తుందని ఎండీ జ్యోతి అన్నారు.
Read Also : BGMI Game Download : బీజీఎంఐ గేమ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? మీ కంప్యూటర్‌లో గేమ్ ఆడాలంటే?