Toyota EV Car : టయోటా EV కొత్త కారు.. సింగిల్ ఛార్జ్‌పై 1200 కి.మీ రేంజ్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్..!
Toyota EV Car : టయోటా 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని యోచిస్తోంది. 2025 నాటికి గ్లోబల్ సేల్స్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లు, EV వెహికల్ కలిగి ఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది.

Upcoming Toyota EV to Deliver 1200 Km Range on Single Charge, Charge Time of 10 Mins
Toyota EV Car : జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా (Toyota) నుంచి సరికొత్త ఈవీ కారు వచ్చేస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ బైక్ సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 1,200 కిమీ (750 మైళ్లు) దూసుకెళ్లగలదు. కేవలం 10 నిమిషాల ఫుల్ ఛార్జ్ అవుతుంది. సాలిడ్-స్టేట్ బ్యాటరీతో రన్ అయ్యే EV (ఎలక్ట్రిక్ వాహనం)ని ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఎలన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోనే టెస్లా (Tesla) సూపర్‌చార్జర్‌లు 15 నిమిషాల్లో 200 మైళ్ల ఛార్జ్‌ను అందిస్తుంది. కొత్త టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా కంపెనీ 2026 నాటికి నెక్స్ట్ జనరేషన్ ఈవీలకు హై-పర్ఫార్మెన్స్ లిథియం-అయాన్ బ్యాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈవీ బ్యాటరీలు త్వరిత ఛార్జింగ్‌ను అందిస్తాయి. సుమారు 1,000 కి.మీ (620 మైళ్ళు) పరిధిని అందిస్తాయి. టయోటా వెహికల్ యాక్సిస్‌లో తర్వాతి జనరేషన్ బ్యాటరీలు, సోనిక్ టెక్నాలజీని అనుసంధానం చేయడం వంటి టెక్నాలజీ ద్వారా 1,000 కి.మీల వెహికల్ క్రూజింగ్ పరిధిని సాధిస్తామని టయోటా తెలిపింది.

Toyota EV Car Deliver 1200 Km Range on Single Charge, Charge Time of 10 Mins
గత ఏడాదిలో మెర్సిడెస్-బెంజ్ లాంగ్ రేంజ్ ‘విజన్ EQXX’ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో 1,000 కి.మీలకు పైగా ప్రయాణించింది. EV ద్వారా ఒకే ఛార్జ్‌తో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించింది. ఆటోమేకర్ ప్రకారం.. జర్మనీ నుంచి ఫ్రాన్స్ దక్షిణం వైపు ప్రయాణం చల్లని వర్షపు పరిస్థితులలో ప్రారంభమైంది.
140kmph వరకు సుదీర్ఘమైన ఫాస్ట్-లేన్ క్రూజింగ్‌తో సహా సాధారణ రహదారి స్పీడ్‌తోప్రారంభమైంది. ఆటోమేకర్ 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని యోచిస్తోంది. 2025 నాటికి ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లు, ఈవీలను కలిగి ఉండేలా గ్లోబల్ సేల్స్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.