Tata Groupలో రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు Walmart ఎదురుచూపులు

tata groups:Walmart Inc టాటా గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. దాదాపు రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. కొత్త సూపర్ యాప్ ద్వారా సాల్ట్ టూ సాఫ్ట్‌వేర్ అనే రీతిలో ప్లాన్ చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్ గురించి Walmart, Tata Group)రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. Tata Groupకు చెందిన ఈ కామర్స్ బిజినెస్, Flipkartకు చెందిన Walmart ఈ-కామర్స్ యూనిట్ ల మధ్య ఒప్పందం జరగనున్నట్లు సమాచారం.




ఆసియాలో అతి పెద్ద ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ గూగుల్, కేకేఆర్ & కో, సిల్వర్ లేక్ పార్టనర్స్‌ల వాటాలు కొనుగోలు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతులు కలిపింది. ఇప్పుడు కొత్త డిజిటల్ ప్లాట్ ఫాంలో టాటాగ్రైప్ ఇన్ వెస్ట్ చేయాలనుకుంటుంది. Walmart పెట్టుబడి దాదాపు 20 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకూ ఉండనుంది.




ఈ సూపర్ యాప్ ను ఇండియాలో డిసెంబర్ లేదా జనవరి నెలల్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టాటా కన్జ్యూమర్ బిజినెస్ ఒకే చానెలా కింద పనిచేయనుంది. హోల్ సేల్ అమ్మకాలు జరుపుతున్న వాల్‌మార్ట్ రిటైల్ ధరలకే యాప్ ద్వారా సేల్ జరపనున్నాడు.




టాటా కన్జ్యూమర్ బిజినెస్ వాచెస్, జ్యూయలరీ బ్రాండ్ టైటాన్, ఫ్యాషన్ రిటైల్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్ విలువ ఒక శాతం కంటే ఎక్కువే లాభాల్లో నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు