Gold Hallmark : మీ బంగారంపై ‘హాల్‌మార్క్‌’ చూశారా? ఈ గుర్తు ఏంటో తెలుసా? అసలు ‘గోల్డ్’పై ఎందుకు ఉంటుందంటే?

Gold Hallmark : బంగారంపై కనిపించే హాల్‌మార్క్‌ గుర్తు గురించి మీకు తెలుసా? హాల్‌మార్క్‌ అనేది ఎందుకు ఉంటుంది? మీరు కొన్న బంగారంపై ఈ గుర్తును గమనించారా? ఓసారి చెక్ చేసుకోండి.

How to Check Hallmark on Gold

Gold Hallmark : బంగారం కొంటున్నారా? బంగారంపై హాల్‌మార్క్ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే, అసలు ఈ హాల్‌మార్క్ ఎందుకు ఉంటుంది? చాలామందికి ఈ గుర్తు గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వాస్తవానికి బంగారంపై హాల్ మార్క్ ఉంటే చాలా మంచిదని భావిస్తారు. మీరు కొనే ప్రతి బంగారం వంటి లోహాపు వస్తువులపై ఈ హాల్ మార్క్ కచ్చితంగా ఉంటుంది.

అసలు ఈ హాల్‌మార్క్‌ గుర్తు ఎందుకు వేస్తారు? అంటే.. హాల్‌మార్క్‌ అనేది క్యారెట్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) స్టాంప్ వంటిది. హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, మార్క్ ఎప్పుడు వేశారనే ఆ ఏడాది గుర్తు, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్ వంటివి బంగారంపై కనిపిస్తాయి.

Read Also : Apple iPhone 16e : బాబోయ్ ఇదేంటి ట్విస్ట్.. ఐఫోన్ SE 4 అన్నాడు.. ఐఫోన్ 16e వదిలాడు.. ఆపిల్ అభిమానులకు టిమ్‌కుక్ బిగ్ సర్‌ప్రైజ్..!

అసలు ఇది ఎందుకంటే.. మనం కొన్న బంగారం స్వఛ్చతను తెలియజేస్తుంది. స్వచ్చమైన బంగారమని ఈ హాల్ మార్క్ ద్వారా సులభంగా కొనుగోలుదారులు గుర్తించేలా ఇలా పెడతారు అనమాట..

వాస్తవానికి అచ్చమైన బంగారం మార్కెట్లో దొరకదు. బంగారానికి కొన్ని ఇతర లోహాలను కలిపితే ముద్దగా మారుతుంది. ఎన్నో ఏళ్లుగా బంగారం విషయంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలామంది మోససోతున్న పరిస్థితులు ఉన్నాయి.

ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హాల్ మార్క్ తప్పనిసరి చేసింది. బంగారంపై క్యారెట్ల గుర్తులను తెలియజేస్తుంది. ఈ హాల్‌మార్క్ గుర్తు చూస్తే.. అక్కడే మీరు బంగారం కొనుగోలు చేసిన షాపు పేరు, బంగారం క్యారెట్ల బరువు దానిపై ఉంటుంది.

బంగారంలో గ్రేడ్లు ఇలా :
ప్రస్తుతం బంగారం స్వచ్ఛత ఆధారంగా గ్రేడ్‌లను నిర్ధారిస్తున్నారు. 916 KDM, 14K, 18K, 22K, 24K అని మార్కెట్లో ఇలా పిలుస్తుంటారు. ఈ బంగారంపై BIS హాల్‌ మార్క్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే అది కల్తీ బంగారం కూడా కావొచ్చు.

కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ క్యారెట్లు, బిల్లు, హాల్ మార్క్ అనే అంశాలను ఇందులో చేర్చింది. వీటి ఆధారంగానే కొనుగోలు దారులు తాము కొనుగోలు చేసే బంగారం అసలైనదేనా? నకిలీదా అని గుర్తించేందుకు వీలుంటుంది.

Read Also : Gold Guide : ఇంట్లో బంగారం ఎంత ఉండొచ్చు? ఇన్‌కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టాలా? పెళ్లి అయ్యాక మహిళల దగ్గర ఎంత ఉండాలి?

బీఎస్ఐకి ఫిర్యాదు చేయాలంటే? :
బంగారాన్ని హాల్‌మార్క్‌ గుర్తు కేటాయించేది బీఐఎస్. అందుకే హాల్‌మార్క్‌‌ పరిశీలిస్తే.. హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, క్యారెట్ బీఐఎస్ స్టాంప్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు కనిపిస్తాయి.

బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఇలా ముద్రిస్తారు. మీకు కావాలంటే హాల్‌మార్క్‌ ఆభరణాలను విక్రయించే షాపులకు సంబంధించి జాబితాను బీఎస్‌ఐ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు కొన్న బంగారం మీద హాల్‌మార్క్‌‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. ఫిర్యాదుల కోసం నేరుగా బీఎస్‌ఐను మీరు సంప్రదించవచ్చు.