Apple iPhone 16e : బాబోయ్ ఇదేంటి ట్విస్ట్.. ఐఫోన్ SE 4 అన్నాడు.. ఐఫోన్ 16e వదిలాడు.. ఆపిల్ అభిమానులకు టిమ్‌కుక్ బిగ్ సర్‌ప్రైజ్..!

Apple iPhone 16e Launch : భారత మార్కెట్లోకి ఆపిల్ కొత్త ఐఫోన్‌ వచ్చేసింది. ఐఫోన్ SE 4 మోడల్‌ను ఐఫోన్ 16e పేరుతో లాంచ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు సీఈఓ టిమ్ కుక్. ఈ కొత్త ఫోన్ ప్రీ-బుకింగ్ సేల్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

Apple iPhone 16e : బాబోయ్ ఇదేంటి ట్విస్ట్.. ఐఫోన్ SE 4 అన్నాడు.. ఐఫోన్ 16e వదిలాడు.. ఆపిల్ అభిమానులకు టిమ్‌కుక్ బిగ్ సర్‌ప్రైజ్..!

Apple CEO Tim Cook introduces iPhone 16e

Updated On : February 20, 2025 / 6:25 PM IST

Apple iPhone 16e Launch : ఆపిల్ అభిమానులకు ఆ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రపంచమంతా ఆపిల్ అత్యంత సరసమైన ఐఫోన్ SE 4 కోసం ఎదురుచూస్తుంటే దానికి బదులుగా ఐఫోన్ 16e పేరుతో మార్కెట్లోకి వదిలాడు.

ఫిబ్రవరి 19న ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ ఈ ఫోన్‌ను కొత్త పేరు, సరికొత్త ఫీచర్లతో ఆపిల్ చౌకైన ఐఫోన్ ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 2022లో లాంచ్ అయిన ఐఫోన్ (iPhone SE 3)కి అప్‌గ్రేడ్ మోడల్ అవుతుంది.

Read Also : Google Pay : గూగుల్ పే చేసే వాళ్లకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఈ బిల్లులు కడితే సర్వీస్ చార్జ్ కూడా కట్..!

ఈ కొత్త ఐఫోన్‌లో ఐఫోన్ 16 అనేక ఫీచర్లను కంపెనీ అందించింది. సీఈఓ టిమ్ కుక్ ఈ కొత్త ఐఫోన్‌ను ఐఫోన్ 16eగా పరిచయం చేశారు. ఆపిల్ ఐఫోన్ SE సిరీస్‌ను నిలిపివేసి కొత్త పేరుతో ప్రవేశపెట్టవచ్చని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఆపిల్ కంపెనీ తమ వినియోగదారులను ఆశ్చర్యపరిచేందుకు ఈ కొత్త ఐఫోన్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ఈ కొత్త ఐఫోన్ 16e వీడియోను రిలీజ్ చేశారు.

ఐఫోన్ 16e ధర :
ఐఫోన్ 16e భారత మార్కెట్లో రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్ మొత్తం 128GB, 256GB, 512GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఇతర రెండు మోడళ్ల ధర వరుసగా రూ. 69,900, రూ. 89,900 ఉండనున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ను ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. ఐఫోన్ 16e ఫోన్ మొత్తం బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16e ఫీచర్లు :
కంపెనీ ఐఫోన్ 16eలో డ్యూయల్ సిమ్ కార్డును అందిస్తోంది. ఒకటి ఫిజికల్ రెండోది eSIM ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 60Hz, 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది.

ఆపిల్ ఈ లేటెస్ట్ ఐఫోన్ iOS18లో రన్ అవుతుంది. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. ఈ లేటెస్ట్ ఐఫోన్ ఆపిల్ 3nm A18 బయోనిక్ చిప్‌తో వస్తుంది. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్‌లో కూడా ఇదే ప్రాసెసర్ అందించారు. ఈ ఐఫోన్ 8GB RAM, 512GB వరకు స్టోరేజీని సపోర్ట్ చేస్తుంది. అయితే, ఆపిల్ ర్యామ్ వివరాలను వెల్లడించలేదు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌‌.. ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. 10 ఏళ్లలో రూ. 12 లక్షలు సంపాదిస్తారు..!

అంతేకాకుండా, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో వస్తోంది. ఐఫోన్ 16e బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. ఓఐఎస్ అంటే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా ఉంది.

ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లో యాక్షన్ బటన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ USB టైప్-C ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో ఫేస్ ఐడీ ఫీచర్ కూడా అందించింది.కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.3, NFC, Wi-Fi 6 వంటి ఫీచర్లు ఉన్నాయి.