Post Office Scheme : పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. 10 ఏళ్లలో రూ. 12 లక్షలు సంపాదిస్తారు..!
Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది. ఇందులో కానీ మీరు పెట్టుబడి పెడితే రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు రూ. 12 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

Post Office Scheme
Post Office Scheme : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో ఎస్ఐపీ (SIP) ద్వారా పెట్టుబడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఈ తరహా మార్కెట్ గురించి అవగాహన లేకపోవడం కావచ్చు. పెద్దగా రాబడిపై విశ్వాసం లేకపోవచ్చు. ఇలా ఆలోచించే వాళ్లు లేకపోలేదు. ఇలాంటి వారికి తక్కువ రాబడే అందుతుంది.
ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ హామీ ఇచ్చే రాబడిని పెంచే పెట్టుబడులపైనే ఎక్కువగా నమ్ముతారు. ఇందులో పెట్టుబడి పెడితే సేఫ్ అని తమ డబ్బును పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తుంటే.. మీకోసం పోస్టాఫీులో అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది. మీరు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ద్వారా పెట్టుబడి పెడితే కేవలం 10ఏళ్లలో రూ. 12 లక్షల వరకు మంచి రాబడిని పొందవచ్చు.
సాధారణంగా పోస్టాఫీసులో పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. ప్రతి నెలా స్థిర మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మంచి రాబడిని పొందవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ పథకం వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించినా 6.7 శాతం వడ్డీ వస్తుంది. తద్వారా భారీగా డబ్బులను సేవ్ చేయొచ్చు. పోస్టాఫీస్ ఆర్డీలో ప్రతి నెలా రూ. 7వేలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో రూ. 5 లక్షలు, 10 ఏళ్లలో రూ. 12 లక్షల వరకు సంపాదించవచ్చు.
రూ. 12 లక్షలు ఇలా పొందవచ్చు :
మీరు ఈ ఆర్డీ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని భావిస్తే.. దాదాపు రూ. 12 లక్షలు కలపవచ్చు. దాంతో మీ మొత్తం పెట్టుబడి రూ. 8,40,000 అవుతుంది. అప్పుడు 6.7 శాతం వడ్డీ రేటుతో పాటు రూ. 3,55,982 మాత్రమే వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 11,95,982 పైగా అంటే దాదాపు రూ. 12 లక్షల వరకు సంపాదించుకోవచ్చు అనమాట.
Read Also : Google Pay : గూగుల్ పే చేసే వాళ్లకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఈ బిల్లులు కడితే సర్వీస్ చార్జ్ కూడా కట్..!
పోస్టాఫీస్ (RD) బెనిఫిట్స్ ఇవే :
పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్ కింద రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ ఏది లేదు. పైగా చక్రవడ్డీ బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు 5 ఏళ్లకు భారీ వడ్డీని పొందుతారు. ఈ స్కీమ్ ప్రకారం.. ఎవరైనా ఒకరు ఎన్ని ఆర్డీ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. వ్యక్తిగత అకౌంట్ మాత్రమే కాకుండా, ముగ్గురు వ్యక్తులకు కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
అంతేకాదు.. పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆర్డీ అకౌంట్ మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. కానీ, ప్రీ క్లోజ్ వ్యవధి 3 ఏళ్ల తర్వాత ఉంటుంది. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. మెచ్యూరిటీ తర్వాత ఆర్డీ అకౌంట్ మరో 5 ఏళ్ల పాటు నడిపించవచ్చు.