మీది ఉందా? : ఈ స్మార్ట్‌ ఫోన్లలో WhatsApp పనిచేయదు!

  • Publish Date - December 31, 2019 / 07:33 AM IST

వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది 2020 నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను త్వరలో నిలిపివేయనున్నట్టు ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. డోంట్ వర్రీ.. అన్ని స్మార్ట్ ఫోన్లలో కాదండోయ్.. కొన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

2020, ఫిబ్రవరి 1 నుంచి పాత వెర్షన్ OS (ఆపరేటింగ్ సిస్టమ్) వాడే స్మార్ట్ ఫోన్లలోనే వాట్సాప్ సపోర్ట్ విత్ డ్రా చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అప్పటినుంచి కొన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో రన్ అయ్యే ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్, అంతకంటే తక్కువ వెర్షన్ OS, iOS 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ OS వాడే యూజర్లు తమ డివైజ్‌లో కొత్త వాట్సాప్ అకౌంట్లను ఎప్పటికీ క్రియేట్ చేసుకోలేరు.

Windows ఫోన్లలో కూడా :
అంతేకాదు.. ప్రస్తుత అకౌంట్లను కూడా రీ-వెరిఫై చేసుకోవడం కుదరదు. జియోఫోన్, జియో ఫోన్2 సహా KaiOS 2.5.1+OSలతో రన్ అయ్యే ఫోన్లలో మాత్రమే వాట్సాప్ సపోర్ట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరోవైపు Windows OS యూజర్లకు కూడా ఇది చేదు వార్తనే చెప్పాలి. విండోస్ ఫోన్లకు కూడా వాట్సాప్ సపోర్టును నిలిపివేయనుంది.

డిసెంబర్ 31, 2019 నుంచి Window Phones లో కూడా Whatsapp సపోర్ట్ విత్ డ్రా చేసుకుంటున్నట్టు ఇదివరకే కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేనెలలో Microsoft కంపెనీ కూడా తమ Windows 10 మొబైల్ OSకు సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 1, 2019 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్ లో తమ యాప్ లభించదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Export Chatతో Save చేసుకోవచ్చు :
కానీ, ఒకవేళ మీరు Windows స్మార్ట్ ఫోన్ యూజర్ అయి ఉంది, డిసెంబర్ 31, 2019 తర్వాత మీ చాట్ బాక్సులోని సమాచారమంతా కోల్పోకూడదంటే మీ చాట్ డేటాను Save చేసుకునేందుకు ఒక ఆప్షన్ ఉంది. Whatsapp Chat బాక్సులో వెళ్లి ‘Export Chat’ డేటా చేయాలనుకుంటే.. Group Infoపై Tap చేయాల్సి ఉంటుంది.

‘Export Chatను Tap చేయగానే Download Chat మీడియాతో లేదా మీడియా లేకుండా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ Chat డేటా మొత్తం Export చేయాలంటే అదే ఎంపిక చేసుకోవచ్చు. పాత వెర్షన్ వాడే ఆండ్రాయిడ్, ఐఫోన్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసు నిలిపివేస్తే ఇతర ఫోన్లలో ఎంతమాత్రం ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. 2020 నుంచి Whatsapp సపోర్ట్ నిలిచిపోయే OSల జాబితా కూడా అందిస్తోంది.

ఈ ఫోన్లలో పనిచేయదు :
* ఆండ్రాయిడ్ వెర్షన్స్ 2.3.7 అంతకంటే పాత వెర్షన్ అయితే
* iOS 8తో పాటు అంతకంటే పాత వెర్షన్ ఉంటే..
* డిసెంబర్ 31, 2019 నుంచి అన్ని Windows OS ఫోన్లలో పనిచేయదు.

వాట్సాప్ సపోర్ట్ చేసే OSలు ఇవే :
* ఆండ్రాయిడ్ OS 4.0.3+ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి.
* iPhone iOS 9+ వెర్షన్ ఉంటేనే పనిచేస్తుంది.
* JioPhone and JioPhone 2 సహా ఎంపిక చేసిన ఫోన్లలో KaiOS 2.5.1+ ఉండాలి.