Gold Silver Rates
Gold Silver Rates : బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ధరలతో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అయితే, తాజాగా.. గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి రేటు భారీగా పెరిగింది.
Also Read : Hyderabad : ఖాళీ ప్లాట్‌లో ఏకాంతంగా కలిసిన ప్రేమికులు.. యువతి తండ్రి రావడంతో..
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, వెండి రేటు భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది.
బంగారం, వెండి, ధరలు పోటీపడి పెరుగుతున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో బంగారం, వెండిలో ఏది అత్యుత్తమంగా మారుతుందనే విషయంపై నిపుణులు ఆసక్తికర సమాధానం చెబుతున్నారు. బంగారం, వెండి పెట్టుబడిదారుల కోసం కీలక సూచనలు చేశారు. ఆనంద్ రతి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్‌లోని AVP-కమోడిటీస్ & కరెన్సీస్ మనీష్ శర్మ తాజా మార్కెట్‌పై అంచనాల ప్రకారం.. బంగారం కన్నా వెండిని కొనడం ఉత్తమమని సూచిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం కంటే వెండి విలువైనదిగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,23,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,840కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,750 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,23,600 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,840కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,26,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,14,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,26,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.