Whirlpool Refrigerator : వర్ల్‌పూల్ కొత్త రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయ్.. ఇక ఐస్ ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. ధర ఎంతంటే?

Whirlpool Refrigerator: వర్ల్‌పూల్ ఇండియా కొత్త నో టెన్షన్ రిఫ్రిజిరేటర్ రేంజ్ సింగిల్ డోర్ కేటగిరీలో విస్తరించింది. ఇందులో ఐస్ ఆటోమాటిక్ గా కరిగిపోతుంది అనమాట.. ధర ఎంతంటే?

Whirlpool Refrigerator

  • వర్ల్‌పూల్ నో టెన్షన్ రిఫ్రిజిరేటర్ ఆటోమేటిక్ డీఫ్రాస్టింగ్ సౌకర్యం
  • వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్లు స్మార్ట్ కూలింగ్‌ అందిస్తాయి.
  • వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్లలో ఫ్లెక్సీకూల్ సౌకర్యం

Whirlpool Refrigerator : అసలే ఎండాకాలం.. చల్లటి కూల్ వాటర్ లేకుంటే కష్టమే. అందుకే చాలామంది సమ్మర్ సీజన్లలో రిఫ్రిజిరేటర్లను ఎక్కువగా వాడేస్తుంటారు. మీరు కూడా కొత్త రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. వర్ల్‌పూల్ ఇండియా సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ లాంచ్ చేసింది. కొత్త నో టెన్షన్ రిఫ్రిజిరేటర్ల రేంజ్ విస్తరించింది.

విటామ్యాజిక్ ప్రో, ఇంప్రో ప్లస్ రేంజ్ ఫ్రిజ్‌లతో ఈ కంపెనీ సింగిల్-డోర్ కేటగిరీలో అతిపెద్ద ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ రిఫ్రిజిరేటర్ల రేంజ్ విస్తరించింది. ఈ రిఫ్రిజిరేటర్లు మాన్యువల్ డీఫ్రాస్టింగ్ టెక్నాలజీతో వచ్చాయి. వర్ల్‌పూల్ కొత్త నో టెన్షన్ రిఫ్రిజిరేటర్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వర్ల్‌పూల్ విటామ్యాజిక్, ఇంప్రో ప్లస్ ధర :
వర్ల్‌పూల్ విటామ్యాజిక్, ఇంప్రో ప్లస్‌తో సహా కొత్త 9 రకాల రిఫ్రిజిరేటర్ల ధర రూ. 17,700 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త రేంజ్ రిఫ్రిజిరేటర్లు 192L నుంచి 274L సామర్థ్యం వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్లు రిటైల్ స్టోర్లలో ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్లు 2-స్టార్ నుంచి 5-స్టార్ వరకు పవర్ కెపాసిటీ రేటింగ్‌లతో వస్తాయి.

వర్ల్‌పూల్ విటామ్యాజిక్, ఇంప్రో ప్లస్ ఫీచర్లు :
వర్ల్‌పూల్ వారి నో టెన్షన్ రిఫ్రిజిరేటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ డీఫ్రాస్టింగ్ అందిస్తాయి. సొంత 6th సెన్స్ ఇంటెల్లిఫ్రాస్ట్ టెక్నాలజీతో ఈ రిఫ్రిజిరేటర్ మంచు పేరుకుపోకుండా నివారిస్తుంది. అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా డీఫ్రాస్టింగ్‌ అవుతుంది. లోపల ఉన్న వస్తువులను ఈజీగా తీసుకోనేందుకు నీరు లోపల ఒలికిపోకుండా నివారిస్తుంది. తద్వారా రోజువారీ రిఫ్రిజిరేషన్‌ మరింత పరిశుభ్రంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

Read Also : Samsung Galaxy A Series : శాంసంగ్ తీసుకోవాలంటే ఇదే బెస్ట్ టైమ్.. A57, A37పై బంపర్ ఆఫర్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

ఆటోమేటిక్ డీఫ్రాస్టింగ్‌తో పాటు విటామ్యాజిక్, ఇంప్రో ప్లస్ రేంజ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్లలో స్మార్ట్ కూలింగ్ మోడ్‌లు ఉన్నాయి. కూలింగ్ పర్ఫార్మెన్స్ ఈజీగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

ఫ్లెక్సీకూల్ ఫీచర్‌తో రిఫ్రిజిరేటర్ కూలింగ్ లెవల్ లో, మిడ్, హై సెట్టింగ్‌లకు సెట్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ ఐస్, ఐస్ స్పీడ్ గా ఉంటుంది. కేవలం 95 నిమిషాలు/2 గంటల కన్నా తక్కువ సమయంలోనే ఐస్‌ను అందిస్తుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఎకో మోడ్ కూడా ఉంది.

ఈ కొత్త రిఫ్రిజిరేటర్‌లో ఫుల్ ఫ్రెష్, పోషకాలతో ఎక్కువ రోజులు ఉండేలా అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తోంది. విటామ్యాజిక్, ఇంప్రో ప్లస్ రిఫ్రిజిరేటర్లు రెండింటిలోనూ మైక్రోబ్లాక్ టెక్నాలజీ ఉంది. 99శాతం వరకు బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. ఇంప్రో ప్లస్ రేంజ్ 15 రోజుల వరకు తాజదనాన్ని అందిస్తుంది. విటామ్యాజిక్ శ్రేణి 12 రోజుల వరకు ఫ్రెష్ నెస్ అందిస్తుంది.

తద్వారా పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. విటామ్యాజిక్ శ్రేణిలో వర్ల్‌పూల్ పేటెంట్ పొందిన జియోలైట్ టెక్నాలజీ కూడా ఉంది. పండ్లు, కూరగాయల నుంచి ఇథిలీన్ వాయువును గ్రహిస్తుంది. ఇథిలీన్ స్థాయిలను నియంత్రించి తాజాదనాన్ని అందిస్తుంది. విటమిన్లను 40శాతం వరకు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచుతుంది.