iPhone Prices : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌లో ఐఫోన్ల ధరలు పెరుగుతాయా? మనదగ్గర తయారైన ఐఫోన్లపై పన్ను ఉంటుందా?

iPhone Prices : ట్రంప్ ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో తయారైన ఐఫోన్‌లపై కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది.

iPhone Prices

iPhone Prices : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. 25శాతం సుంకంతో ప్రారంభమై ఇప్పుడు 50శాతానికి (iPhone Prices) చేరుకుంది. భారత్ నుంచి చాలా ఎగుమతులపై తీవ్ర ప్రభావితం చూపనుంది.

కానీ, భారత్ నుంచి అమెరికాకు ఆపిల్ ఐఫోన్ ఎగుమతుల సుంకాల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ట్రంప్ ఏప్రిల్ 2025లో స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌లను మినహాయించింది.

ప్రస్తుతానికి, భారత్ ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికే చైనాను అధిగమించి యునైటెడ్ స్టేట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు దూరంగా ఆపిల్ భారత మార్కెట్లో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచింది.

అమెరికా వాణిజ్య విభాగం దేశ వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232 కింద సెమీకండక్టర్ల వంటి జాతీయ భద్రతకు ముఖ్యమైన రంగాలను పరిశీలిస్తోంది. అప్పటివరకూ భారత్ నుంచి ఎగుమతి చేసే ఐఫోన్‌లపై మనకు ఎలాంటి సుంకాలు ఉండకపోవచ్చు.

భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతులపై సుంకాలు విధిస్తారా? :
భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతి టారిఫ్ స్లాట్ కిందకు వస్తే.. ఆపిల్‌ కంపెనీకి కొంచెం క్లిష్టంగా మారుతుంది. కంపెనీ భారత్ నుంచి ఎగుమతి చేస్తూనే ఉంటే ఆపిల్ మార్జిన్లపై రాజీ పడాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచాల్సి ఉంటుంది. అమెరికాలోని ఐఫోన్ లవర్స్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Read Also : Xiaomi 14 CIVI : అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. షావోమీ 14 CIVI ఫోన్‌పై రూ. 14వేలు డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి..!

అదేవిధంగా, భారత్‌కు టారిఫ్స్ పరంగా ప్రభావం పడొచ్చు. ఆపిల్ సుంకాల కారణంగా భారత్ నుంచి ఎగుమతులను 40 శాతం నుంచి 50 శాతం తగ్గించవచ్చు. అదేజరిగితే.. రాబోయే ఐఫోన్ 17 సిరీస్ సేల్స్, ధరలపై ప్రభావం పడుతుంది. ట్రంప్ సుంకాలు భవిష్యత్తులో ఆపిల్ ఇండియా ఎగుమతులను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ట్రంప్ సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. 21 రోజుల తర్వాత ఈ నిబంధన అమల్లోకి రానుంది. అయితే, ప్రస్తుతం 25 శాతం నిబంధన మాత్రమే దీనికి వర్తిస్తుంది. ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయం వల్ల ఐఫోన్ల ధరలు పెరుగుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆపిల్ డివైజ్‌లకు ప్రత్యేక సుంకం ఉంటుంది. నివేదికల ప్రకారం, ఆపిల్ డివైజ్‌లను ప్రత్యేక టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావడంపై త్వరలోనే ప్రకటన రానుంది. ఐఫోన్‌లు ఇకపై ట్రంప్ పెంచిన పన్ను పరిధిలోకి రావు అనమాట.

ఐఫోన్ 17 లాంచ్ ఎప్పుడంటే? :
వచ్చే నెలలో ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌ సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది. తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను సెప్టెంబర్ 9, 2025న లాంచ్ చేయవచ్చని అంచనా. అయితే, ఇప్పటివరకు ఈ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.