Yamaha Tricity 300 : వారెవ్వా.. వరల్డ్ ఫస్ట్ ఎయిర్‌బ్యాగ్ స్కూటర్.. యమహా ట్రైసిటీ 300 లుక్, స్టైల్ సూపర్!

Yamaha Tricity 300 : ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్‌ స్కూటర్ యమహా ట్రైసిటీ 300 లాంచ్ అయింది. ఈ త్రి వీలర్ స్కూటర్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చిన ఈ వేరియంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్కూటర్‌గా నిలిచింది.

Yamaha Tricity 300

  • ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ బ్యాగ్ స్కూటర్
  • యమహా ట్రైసిటీ 300 స్కూటర్ లాంచ్, మరెన్నో ఫీచర్లు
  • త్వరలో సాధారణ రైడర్‌లకు అందుబాటులోకి

Yamaha Tricity 300 : కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? ప్రపంచంలోనే ఫస్ట్ ఎయిర్‌బ్యాగ్‌ స్కూటర్ వచ్చేసింది. యమహా ట్రైసిటీ 300 పేరుతో యమహా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మూడు వీల్స్ స్కూటర్‌ను అద్భుతమైన బ్యాలెన్స్ అందిస్తుంది. ఆటోలివ్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ఎయిర్‌బ్యాగ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి స్కూటర్‌గా నిలిచింది.

అలాగే, ఫ్రంట్ సైడ్ ఏప్రాన్‌లో అడ్వాన్స్ సెన్సార్లతో ఎయిర్‌బ్యాగ్ ఉంటుంది. ముందు నుంచి ఏదైనా ఢీకొన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్ వెంటనే ఓపెన్ అయ్యేలా సెట్ చేశారు. తద్వారా ప్రయాణీకుడి ప్రాణాలను రక్షించడంతో పాటు ముందుకు వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. కార్లలోని ఎయిర్‌బ్యాగ్‌లు సీట్ బెల్ట్‌లతో కనెక్ట్ అయి ఉంటాయి.

ఈ సిస్టమ్ ప్రత్యేకంగా ప్రయాణీకులు ప్రమాద సమయంలో ముందుకు క్రష్ కాకుండా నిరోధిస్తుంది. తద్వారా గాయాలు కాకుండా ఉంటాయి. దీనిని సిమ్యులేషన్, రియల్ టైమ్ క్రాష్ టెస్టింగ్ రెండింటిలోనూ పరీక్షించారు.

కొనుగోలుదారులు ఈ స్కూటర్ ఎయిర్‌బ్యాగ్‌లతో లేదా ఎయిర్‌బ్యాగ్‌లు లేకుండా వేరియంట్‌ ఎంచుకోవచ్చు. టూ-వీలర్లకు ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ పూర్తిగా కొత్తదేమీ కాదు.. గోల్డ్ వింగ్ టూర్ వంటి మోడళ్లలో ఇప్పటికే ఉంది. అతి త్వరలో సాధారణ రైడర్‌లకు అందుబాటులోకి రానుంది.

యమహా ట్రైసిటీ 300 డిజైన్, టెక్నాలజీ :
2026 మోడల్ ఫేస్‌లిఫ్ట్‌ పొందింది. ఆకర్షణీయమైన స్టైలింగ్‌ అందిస్తుంది. ఇందులో కొత్త ఎల్ఈడీ లైటింగ్, రీడిజైన్ ఫ్రంట్ బాడీ ప్యానెల్, స్ప్లిట్-స్టైల్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. మోడ్రాన్, స్పోర్టీ డిజైన్ అందిస్తుంది. యమహా మిల్కీ వైట్, జెన్ గ్రీన్, పవర్ గ్రే వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Oppo A6s 5G : భారీ బ్యాటరీతో ఒప్పో A6s 5G వచ్చేసిందోచ్.. 50MP డ్యూయల్ కెమెరా ఫీచర్లు కేక, ధర జస్ట్ ఎంతంటే?

బ్రేకింగ్ పవర్ ఆప్టిమైజ్ కోసం కొత్త బ్రేక్ కంట్రోల్ సిస్టమ్‌ అందించింది. అదనంగా, బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రంట్, బ్యాక్ వీల్స్ మధ్య బ్రేకింగ్‌ను ఆటోమాటిక్ బ్యాలెన్స్ చేస్తుంది. సడన్ గా ఆపినప్పుడు స్టేబుల్ గా ఆగుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ అనేది కఠినమైన భూభాగాలపై, గ్రీప్ కోల్పోకుండా ఉంటుంది.

యమహా ట్రైసిటీ 300 ఫీచర్లు :
ఈ స్కూటర్‌లో 4.2-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, 2.8-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో మోడ్రాన్ డిజిటల్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఇందులో ఇంటర్నల్ గార్మిన్ నావిగేషన్, మైరైడ్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలోనే ఫోన్ కాల్ మ్యూజిక్ అలర్ట్‌లను చెక్ చేసుకోవచ్చు.

ఇతర ఫీచర్లలో కీలెస్‌ స్టార్ట్, స్టోరేజ్ స్పేస్, పార్కింగ్ బ్రేక్, యమహా లీనింగ్ మల్టీ-వీల్ సిస్టమ్ ఉన్నాయి. ఈ సిస్టమ్ టర్నింగ్ సమయంలో గ్రిప్ కోసం రెండు ఫ్రంట్ వీల్స్ ఒకేసారి వంగేలా చేస్తుంది. అంతేకాకుండా, స్టాండింగ్ అసిస్ట్ సిస్టమ్ తక్కువ వేగంతో లేదా ఆగినప్పుడు స్కూటర్‌ను నిటారుగా ఉంచేలా చేస్తుంది. అదే సమయంలో ఫుట్-ఆపరేటెడ్ బ్రేక్, 14-అంగుళాల వీల్స్ మొత్తం కంట్రోలింగ్ అందిస్తాయి.

యమహా ట్రైసిటీ 300 ఇంజిన్ :
యమహా ట్రైసిటీ 300, 28 PS పవర్, 28.9Nm టార్క్ ఉత్పత్తి చేసే 292cc ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌కు వి-బెల్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. లీటరుకు 30.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంజన్ సెటప్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ, లేటెస్ట్ ఉద్గార నిబంధనల కోసం కొత్త క్యాటలిటిక్ కన్వర్టర్‌ను యాడ్ చేయాలి.

ఈ యమహా స్కూటర్ యూరప్‌లో అతి త్వరలో అమ్మకానికి రానుంది. అక్కడ వినియోగదారులు స్టాండర్డ్ వెర్షన్, ఎయిర్‌బ్యాగ్ వేరియంట్ ప్రస్తుతం భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు.