Gold Rates Forecast: వామ్మో బంగారం ధరలు ఎంతగా పెరిగిపోనున్నాయో తెలుసా? పసిడిపై పెట్టుబడి పెట్టారనుకో…

బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఏం జరగనుందో తెలుసా?

Gold

సిటీ, యూబీఎస్‌ వంటి పలు ప్రధాన బ్యాంకులు బంగారం ధరల పెరుగుదల/తగ్గుదలపై ఉన్న అంచనాలను అప్‌డేట్‌ చేశాయి. ఆయా బ్యాంకులు సవరించిన అంచనా ప్రకారం.. పసిడి ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. అనేక దేశాల నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధాల గురించి ఆందోళన నెలకొంది.

దీంతో తమ ధనాన్ని దాచుకోవడానికి సురక్షిత మార్గాలపై చాలా మంది దృష్టిపెడుతున్నారు. మార్కెట్ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ పరిస్థితులు వస్తున్నాయి.

సిటీ, యూబీఎస్‌ నిపుణులు గోల్డ్ ప్రైస్‌ టార్గెట్లను పెంచారు. అంటే, బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. దీంతో వారు తమ ధరల అంచనాలను పెంచారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కనపడుతోంది.

Also Read: సారీ సార్.. అంటూ హీరో విశ్వక్‌ సేన్ ఆవేదనాభరిత కామెంట్స్‌.. దయచేసి బలి చేయొద్దంటూ..

భౌతిక బంగారం (నాణేలు, కడ్డీలు, ఆభరణాలు వంటి ప్రత్యక్ష బంగారు ఆస్తులు) విలువ/ధరతో ముడిపడి ఉన్న పీఏఎక్స్‌జీ, ఎక్స్‌ఏయూటీ వంటి డిజిటల్ కరెన్సీలు బంగారం ధరలు పెరిగేకొద్దీ మరింత పాపులర్‌ అవుతున్నాయి.

ఈ క్రిప్టోకరెన్సీలు ఇతర డిజిటల్ నాణేల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే అవి ఆర్థిక అనిశ్చితి, ప్రపంచ ఉద్రిక్తతల వంటి సమయంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతాయి.

సిటీ బ్యాంకు ఇప్పుడు స్వల్పకాలిక బంగారు ధరల లక్ష్యాన్ని ఔన్స్‌కు 3,000 డాలర్లుగా నిర్ణయించింది. అంటే త్వరలోనే పసిడి ధర 3,000 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ఏడాదికి సగటు ధర 2,900 డాలర్లుగా ఉంటుందని అంచనా వేసి చెప్పింది. గతంలో ఈ అంచనా 2,800 డాలర్లుగా సిటీ బ్యాంకు వేసుకుంది. ఇప్పుడు దాన్ని సవరించింది. వాణిజ్య యుద్ధాల వల్ల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.