×
Ad

Aadhaar Card : ఇకపై హోటళ్ళు, ఎయిర్‌పోర్టుల్లో ఆధార్ అడిగినా ఇవ్వొద్దు.. UIDAI కొత్త యాప్‌తో రియల్ టైమ్ వెరిఫికేషన్!

Aadhaar Card : హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలకు ఇకపై ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొత్త డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీ రాబోతుంది. కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.

Aadhaar Card ( Image Credit : AI )

  • ఆధార్ కార్డు మర్చిపోయినా ఇబ్బంది లేదు ఆధార్ యాప్‌ ఉంటే చాలు
  • హోటళ్లు, ఎయిర్ పోర్టుల్లో ఆధార్ కార్డు కాపీతో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ మాత్రమే
  • పేపర్ వర్క్ లేదు, ఫిజికల్ ఆధార్ ఐడీ లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు

Aadhaar Card : మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో స్టే చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో అక్కడి హోటల్ సిబ్బంది వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు వివరాలను అడుగుతుంటారు. అయితే, అందరూ ఆధార్ కార్డు కాపీని ఇస్తుంటారు. కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో విమానశ్రయాల్లో కూడా వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా ఆధార్ వివరాలను షేర్ చేయడం ద్వారా డేటా లీకేజీలు, మోసాలు పెరిగిపోతాయి. వ్యక్తిగత వివరాలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువస్తోంది.

ఈ రూల్ ప్రకారం.. ఇకపై హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలకు ఆధార్ కార్డుల ఫోటోకాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త డిజిటల్ వెరిఫికేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుత ఆధార్ చట్టం ప్రకారం.. కారణం లేకుండా ఒకరి ఆధార్ కార్డు ఫోటోకాపీని స్టోర్ చేయడం చట్టవిరుద్ధం.

క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ :

ఆధార్ సంబంధిత వెరిఫికేషన్ నిర్వహించే సంస్థలు ఇప్పుడు ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. ఈ సిస్టమ్ క్యూఆర్ కోడ్‌ ఆధారిత స్కాన్ ఆప్షన్ అందిస్తుంది. ఆధార్ మొబైల్ యాప్‌ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.

త్వరలో కొత్త రూల్ అమల్లోకి :
ఈ కొత్త రూల్ అతి త్వరలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త వెరిఫికేషన్ మెథడ్ ద్వారా ఇంటర్మీడియరీ సర్వర్ల సమస్యలు కూడా తగ్గుతాయి. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అవసరమయ్యే సంస్థలకు ఈ వెరిఫికేషన్ సిస్టమ్ వారి సాఫ్ట్‌వేర్‌లో ఇంటిగ్రేట్ చేసేందుకు API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) వినియోగిస్తారు.

Read Also : Senior Citizens FD Rates : ఈ బ్యాంకు FDలపై 8.10శాతం వరకు భారీ వడ్డీ ఇస్తోంది.. సీనియర్ సిటిజన్లకు గోల్డెన్ ఛాన్స్..!

ప్రస్తుతం యూఐడీఏఐ కొత్త యాప్‌ను బీటా టెస్టింగ్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రతిసారీ సెంట్రల్ ఆధార్ డేటాబేస్‌కు కనెక్ట్ అవసరం లేకుండానే వెరిఫికేషన్‌ పూర్తి అవుతుంది. విమానాశ్రయాలు, స్టోర్లు, హోటళ్ల వంటి దగ్గర ఈజీగా ఉపయోగించవచ్చు.

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ కూడా ఈజీ కానుంది. పేపర్ వర్క్ ఉండదు. యూజర్ ఆధార్ డేటా సేఫ్టీ అందిస్తుంది. అదనంగా, కొత్త యాప్ యూజర్లు తమ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ ఫోన్‌లు లేని ఫ్యామిలీ మెంబర్లను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ డేటాతో ఇక ఆధార్ సేఫ్టీ :
ఈ యాప్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ ఆధారంగా రూపొందింది. రాబోయే 18 నెలల్లో దేశవ్యాప్తంగా పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ కొత్త టెక్నాలజీ ఆధార్ సంబంధిత సేవల్లో యూజర్ల ప్రైవసీ, డేటా సేఫ్టీని అందించనుంది.

ఇకపై ఆధార్ కార్డు ఫొటోకాపీని ప్రతిచోటా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మొబైల్ యాప్ ద్వారా తమ ఆధార్‌ను ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ ఫొటోకాపీలు ఇవ్వడం లేదు. ఫిజికల్ కార్డ్ అవసరం లేదు. రిసెప్షన్ డెస్క్ వద్ద యాప్ డౌన్‌లోడ్ చేయడం కన్నా మీరు ప్రయాణానికి ముందు యాప్‌ను సెటప్ చేసుకోవడం బెటర్.

ఆధార్ UIDAI యాప్‌ ఎలా వాడాలంటే? :

  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి.
  • వెరిఫికేషన్ తర్వాత యాప్ మీ వివరాలతో QR కోడ్‌ను జనరేట్ చేస్తుంది
  • మీ ఫోన్‌ను హోటల్ రిసెప్షనిస్ట్‌కు ఇవ్వండి. ఫ్రంట్ డెస్క్ వద్ద కోడ్‌ను స్కాన్ చేస్తారు
  • ఈ కొత్త సిస్టమ్ రియల్ టైమ్ లోనే వెరిఫికేషన్ జరుగుతుంది.
  • చెక్-ఇన్ ప్రాసెస్ పూర్తి అయినట్టే.