YouTube Monetization Rules: యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఇకపై 8000 గంటలు.. వారికి కూడా..
యూట్యూబ్ (YouTube Monetization Rules)కంటెంట్ క్రియేటర్లకు యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.
YPP made key changes to YouTube monetization rules.
- యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనల మార్పు
- ఎనిమిది వేల గంటల వాచ్‌టైమ్
- కొత్త క్రియేటర్లకు భారీ షాక్
YouTube Monetization Rules: యూట్యూబ్ వేదికగా కొత్తగా ఛానెళ్లు ప్రారంభించి డిజిటల్ కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలనుకునే యువ క్రియేటర్లకు యూట్యూబ్ (YouTube Monetization Rules)యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది. గ్లోబల్ డిజిటల్ మార్కెట్లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రోజూ యూట్యూబ్ షార్ట్స్ వీక్షణలు ఏకంగా 200 బిలియన్లు దాటడం, స్మార్ట్ టీవీల్లో వీడియోల వీక్షణ సమయం బిలియన్ గంటలకు పైగా ఊపందుకోవడంతో సంస్థ తమ మోనిటైజేషన్ నిబంధనలలో కఠిన మార్పులను తీసుకువచ్చింది. 2018 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో ప్రమాణాలను సవరించడం ఇదే తొలిసారి.
Donald Trump: ట్రంప్‌కు ‘ట్రూత్ సోషల్’ దెబ్బ.. ఏకంగా రూ.2,000 కోట్ల నష్టం.. ఇక దానిపైనే ఫోకస్
ఫిబ్రవరి 1, 2027 నుంచి కొత్త రూల్స్:
నూతన మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 1, 2027 నుండి వైపీపీ ద్వారా ప్రకటనల ఆదాయం పొందాలంటే కొత్త క్రియేటర్లకు లక్ష్యాలు రెట్టింపయ్యాయి. ఛానెల్ మోనిటైజ్ కావడానికి గడిచిన 365 రోజుల్లో 8,000 వాచ్ హవర్స్ పూర్తి చేయాలి లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. అయితే 1,000 సబ్స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో సభ్యులుగా ఉన్న దాదాపు 30 లక్షల మంది పాత క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ ఉపశమనం కల్పించారు.
షార్ట్స్ ఆదాయంపై పరిమితులు, ప్రీమియం లైట్ ప్రణాళికలు:
పాత, కొత్త క్రియేటర్లు ఇద్దరికీ వర్తించేలా షార్ట్స్ మోనిటైజేషన్పై యూట్యూబ్ మరో కీలక నిబంధన విధించింది. షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనల ఆదాయం పొందాలంటే ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల వ్యూస్ కొనసాగించాల్సిందే, వ్యూస్ తగ్గితే షార్ట్స్ ఆదాయం నిలిచిపోతుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫండింగ్ దిగువ స్థాయి నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కాగా, భారత్‌లో నెలకు కేవలం రూ.89లకే అందుబాటులో ఉన్న ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్‌ను గ్లోబల్‌గా విస్తరిస్తూ, దాని ద్వారా వచ్చే నికర ఆదాయంలో 60 శాతం వాటాను క్రియేటర్లకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
