జొమోటో నుండి 5వేల రెస్టారెంట్లు ఔట్

  • Publish Date - February 23, 2019 / 09:14 AM IST

ప్రముఖ ఫుడ్ సరఫరా కంపెనీ జొమోటో.. ఐదు వేల రెస్టారెంట్లను  ఫిబ్రవరిలో తమ లిస్ట్ నుండి తొలిగించినట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(Food Safety and Standards Authority of India) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని జొమోటో ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Read Also: Flying Taxi: భవిష్యత్ రవాణా మొత్తం గాల్లోనే..

ఈ సంధర్భంగా.. నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయని జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా చెప్పారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం మాకు కీలకంగా మారిందని, మాతో అనుబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తామని వెల్లడించారు.