5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం

  • Publish Date - October 26, 2020 / 07:40 AM IST

5 years old girl raped : ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా ఖాగా గ్రామంలో 5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. శనివారం, అక్టోబర్ 24 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను , బాలుడుసమీపంలోని నిర్మానుష్యప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచారం జరిపాడు.


బాలిక ఇంటికి తిరిగి వచ్చి తల్లితండ్రులకు జరిగిన విషయం చెప్పింది. గ్రామ పెద్దలు జరిగిన ఘటనపై రాజీ కుదర్చాలని చూశారు. కానీ బాధితురాలి తల్లి తండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఖాగా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్కే సింగ్ తెలిపారు.

నిందితుడిపై అత్యాచార ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 376, లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం (పోక్సో) చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.