ఆయుర్వేద మందుల పేరుతో వెయ్యికోట్ల హెరాయిన్ స్మగ్లింగ్

  • Publish Date - August 12, 2020 / 09:40 AM IST

ఆయుర్వేద మందుల పేరుతో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.

వెదురు బొంగుల్లో హెరాయిన్ నింపి , ఆయుర్వేద ఔషధం అని చెప్పి స్మగ్లర్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఈమాదక ద్రవ్యాన్ని న్వా షెవా పోర్టు ద్వారా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 191 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వెదురు బొంగుల లోపల ప్లాస్టిక్ పైపులు అమర్చి అందులో మాదక ద్రవ్యాలు నింపి రావాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు నౌకాశ్రయంలో దాడి చేసి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.