ప్రేమలో ఓడిపోయిన మహిళా న్యాయవాది…ఆత్మహత్య

  • Publish Date - August 14, 2020 / 02:20 PM IST

ప్రేమ పేరుతో మోసపోయి, ఆత్మహత్య చేసుకున్న మహిళా న్యాయవాది ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ కు చెందిన మహిళా న్యాయవాది (28) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెను గత రెండేళ్లుగా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు.

పెళ్లి చేసుకుంటానని అతను హామీ ఇవ్వటంతో ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని న్యాయవాది తన ప్రియుడ్ని కోరగా అతడు తిరస్కరించాడు.  అప్పటి నుంచి  ఈమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన న్యాయవాది సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

ఆమెతో ప్రేమలో ఉన్న వ్యక్తికి ఇప్పటికే పెళ్ళైం దని..భార్యకు విడాకులు ఇచ్చేసి న్యాయవాదిని పెళ్లి చేసుకుంటానని  హామీ ఇచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాది ఇంటి నుంచి ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.