కత్తి పోట్లకు కారణమైన లౌడ్ మ్యూజిక్…ఒకరు మృతి

  • Publish Date - October 30, 2020 / 07:48 AM IST

4 Men arrested in Delhi, killing neighbour for playing loud music : ఢిల్లీలోని మహేంద్ర పార్క్  పోలీసు స్టేషన్ పరిధిలో చిన్న వివాదం హత్యకు దారి తీసింది. ఎక్కువ శబ్దం వచ్చేలా మ్యుజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న కుటుంబాన్ని……సౌండ్ తగ్గించి వినమని చెప్పినందుకు ..ఒక కుటుంబంలోని ముగ్గరు కత్తి పోట్లకు గురయ్యారు. వారిలో ఒకరు మరణించగా…మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు.

వాయువ్య ఢిల్లీలోని ఆదర్స్ నగర్ మెట్రో స్టేషన్, గేట్ నెంబర్ 4, జుగ్గి సరాయ్ పిపాల్ తాలా సమీపంలో నివసించే అబ్దుల్ సత్తార్ ఆజాద్పూర్ లో వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం నాడు ఇంట్లో ఎక్కువ సౌండ్ వచ్చేలా మ్యూజిక్ పెట్టుకుని కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు.



వీరి ఇంటిపక్కనే ఉండే సుశీల్, సునీల్, అనీల్, అనే అన్నదమ్ములు బిగ్గరగా వస్తున్న సౌండ్ కు అభ్యంతరం చెప్పారు. సత్తార్ అందుకు అభ్యంతరం చెప్పాడు. ఇంట్లో నుంచి సత్తార్ కొడుకులు షహనావాజ్, ఆఫాక్, చంద్ మరియు హసీన్ బయటకు వచ్చారు. దీంతో వారి మధ్య గొడవ పెద్దదైంది. ఇరు కుటుంబాలు కత్తులతో దాడికి దిగారు.

సత్తార్ కుటుంబం చేసిన కత్తుల దాడిలో సుశీల్ అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కొసం బిజెఆర్ఎం ఆసుపత్రి ఆస్పత్రకి తరలిస్తుండగా…… సుశీల్(29) కన్నుమూశాడు. వీరిలో అనిల్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.



ఈ ఘర్షణలో సత్తార్ భార్య షాజహాన్ కూడా గాయపడి బిజెఆర్ఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. సునీల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్తార్ తో పాటు అతని ముగ్గురు కుమారులను అరెస్ట్ చేశారు. దాడిలో పాల్గోన్న మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా బుధవారం పరామర్శించారు.