constable suspended due to illicit behaviour : భూమి వివాదంలో పోలీసులను ఆశ్రయించిన మహిళతో కానిస్టేబుల్ జరిపిన రాసలీలల ఆడియో వైరల్ అవటంతో జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ పై, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే క్రమశిక్షణా చర్యలు చేప్టటారు.
భూమివిషయంలో పోలీసులు సాయం కోరిన మహిళతో కానిస్టేబుల్ జరిపిన ఫోన్ కాల్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసిన ఎస్పీ ప్రశాంత్ పై శాఖాపరమైన చర్యల చేపట్టి నివేదకి తెప్పించుకున్నారు. అవి నిజమని తేలటంతో ప్రశాంత్ ను సస్పెండ్ చేశారు.