Crime News: పంజాబ్ లోని ఆరుగురు పోలీసు అధికారులు ఒక మహిళా ఎక్సైజ్ అధికారిని రోడ్డుపై కారులో వెంబడించి వేధించారు. అదేంటని అడిగిన ఆమె బావను కాల్చి చంపారు. బటాలాలో మద్యం సేవించిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎక్సైజ్ శాఖ మహిళా అధికారి అమర్ ప్రీత్ కౌర్ ఆదివారం ఆగస్ట్30వ తేదీన బటాలాలోని భగవాన్ పూర్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు కారులో బయలు దేరారు. ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకు రోడ్డుపై రెండు కార్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆరుగురు పోలీసు అధికారులు అదే రోడ్డులో ప్రయాణిస్తున్నారు.
ఒంటిరిగా కారులో వెళ్తున్న అమర్ ప్రీత్ కారును వీరు వెంబడించారు. ఆమె కారుకు వీరి కార్లు అడ్డం పెడుతూ ఆమెను ఇబ్బందికి గురి చేశారు. కారులోంచి ఆమెపై అసభ్య మైన కామెంట్లు చేస్తూ దాదాపు 15 నిమిషాలకు పైగా ఆమెను వెంబడించారు. ఈలోగా ఆమె వెళ్లాల్సిన భగవాన్ పూర్ వెళ్లే రోడ్డులోకి తిరిగారు. అది ఇరుకైన రోడ్డు అవటంతో ఆమె కారు నిదానంగా నడుపుతూ వెళ్లారు. అయినా వారు ఆమెను వెంబడిస్తూ గ్రామంలోకి వచ్చారు.
ఆమె కారు దిగి తన ఐడెంటెటీ కార్డును చూపించారు. తానోక ఎక్సైజ్ అధికారినని చెప్పినా వారు వినకుండా ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టారు. ఆమె వెంటనే ఆగ్రామంలోని తన బావ గుర్మేజ్ సింగ్(28) ను పిలిచారు. అక్కడకు వచ్చిన గుర్మేజ్ పోలీసులు ప్రవర్తనను అడ్డుకోబోయారు. వారిని వారించాడు. అయినా వారు వినకపోగా నిందితుల్లో ఒకరు తన సర్వీసు రివాల్వర్ తో గుర్మేజ్ పై కాల్పులు జరపటంతో ఆయన అక్కడి కక్కడే చనిపోయారు.
https://10tv.in/genelia-deshmukh-says-she-was-diagnosed-with-covid-19-three-weeks-ago-has-tested-negative-today/
కాల్పులు శబ్దం విని సమీపంలోని ప్లే గ్రౌండ్ లో ఆటలాడుకుంటున్న సుమారు 25 మంది అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న పోలీసులు వారితో వాగ్వాదానికి దిగగా… గ్రామస్తులు అడ్డుకున్నారు. స్దానిక పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్దలానికి పోలీసులు వచ్చారు.
నిందితులు అమృత్ సర్ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎఎస్‌ఐలు) రంజీత్ సింగ్, బల్జీత్ సింగ్, కానిస్టేబుల్స్ అవతార్ సింగ్, బల్కర్ సింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. మంత్రి అమరీందర్ సింగ్ భద్రతా సిబ్బందిలోని ఒక పోలీసు మరియు , సిమ్రాత్ సింగ్ అనే మరో పోలీసు ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
వీరిపై కోట్లీ సూరత్ మల్హి పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదైందని నిందితుల పోలీసుల అరెస్టును ధృవీకరిస్తూ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) బటాలా రాచ్‌పాల్ సింగ్ తెలిపారు. కాగా…. గుర్మేజ్‌ను కాల్చి చంపిన నిందితుడి పేరును ఎస్‌ఎస్‌పి సింగ్ వెల్లడించలేదు.