ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన కుర్రాడు

  • Publish Date - July 28, 2020 / 10:47 AM IST

చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపాడు. జాష్ పూర్ జిల్లాలోని  ఓగ్రామంలో శుక్రవారం, జులై 24 న ఓ బాలిక పశువుల మేత కోసం తమకు బంధువైన యువకుడిని తీసుకుని అడవికి వెళ్లింది.

అడవిలోకి వెళ్లి మేత కోసే సమయంలో యువకుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఇంట్లో తల్లి తండ్రులకు చెప్తా అంది. భయ పడిన యువకుడు బాలికను బండరాయితో కొట్టి హత మార్చాడు. శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలోని జలపాతం లోకి విసేరేసి ఇంటికి వచ్చేశాడు.

మేత కోసం అడవికి వెళ్ళిన బాలిక ఎంత సేపటికీ తిరిగి రాకపోయే సరికి ఆమె తల్లితండ్రులు చాలా ప్రాంతాల్లో గాలించారు. వారి బంధువుల కుర్రాడితోనే బాలిక అడవికి వెళ్ళినట్లు తెలుసుకున్నారు. వారు ఆయువకుడిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు, దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు.

పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష), 302 (హత్యకు శిక్ష) కింద, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.