16 ఏళ్ళ బాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం

  • Publish Date - September 22, 2020 / 03:44 PM IST

tamilnadu crime news తమిళనాడులో దారుణం జరిగింది. 16 ఏళ్లబాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసారు. కడలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె పెంపుడు తండ్రి(60) నంగలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు.

అక్కడ డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భవతిని అని తేల్చారు. డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైనర్ బాలిక గర్భవతి అవ్వటంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ప్రసూతి వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిరుపక్కం పోలీసులు దర్యాపప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దారుణమైనవిషయాలు వెలుగు చూశాయి.



బాలిక గర్భవతికావటానికి పెంపుడుతండ్రే కారణమని తేలింది.బాలికకు రెండేళ్ల వయస్సు ఉండగా పెంపుడు తండ్రి ఆమెను దత్తత తీసుకున్నాడు. బాలికకు వారి ఇంటి సమీపంలోని 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయువకుడు బాలికతో తన శృంగార కోరికలు తీర్చుకునేవాడు.

యువకుడు పెళ్లి చేసుకుంటాడనే ఆశతో బాలిక అతడితో అనేక సార్లు శృంగారంలో పాల్గోంది. బాలిక వేరోక యువకుడితో లైంగిక సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న పెంపుడు తండ్రి కూతుర్ని మందలించకపోగా ఆమెను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకున్నావు కనుక నా కోరిక కూడా తీర్చమని బాలికపై లైంగికంగా దాడిచేయటం ప్రారంభించాడు.



ఇటు పెంపుడు తండ్రి. అటు పెళ్లి చేసుకుంటాన్న ప్రియుడు ఇద్దరూ బాలికపై తరచూ లైంగిక దాడి చేయటంతో బాలిక గర్బం ధరించింది. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని నిందితులిద్దరూ చెప్పటంతో బాలిక తన బాధ ఎవరికీ చెప్పకోలేక వారికి సహకరిచింది. నిందితులిద్దరిపై పోలీసులు ఏపీసీ సెక్షన్ల కింద మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 లోని సంబంధిత విభాగాల కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.